టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఓ వైపు డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతూనే.. మరోవైపు అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు దిల్ రాజు. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చాలా సక్సెస్ సినిమాలను తీసుకొచ్చారు. అదేవిధంగా కొన్ని ఫెయిల్యూర్ సినిమాలను కూడా తీసుకొచ్చారు. టాలీవుడ్ లో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా రెండింటిలో సక్సెస్ సాధిస్తున్నది ఎవరైనాా ఉన్నారంటే అది కేవలం దిల్ రాజు అనే చెప్పాలి. తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Also Read : మరోసారి రెచ్చిపోయిన సమంత…చైతూను ఉద్దేశించే ఆ కామెంట్స్ చేసిందా..?
Advertisement
సపోజ్ మీరు ప్రొడ్యూసర్ కాదు.. అవ్వలేదు అనుకోండి.. డిస్ట్రిబ్యూటర్ గా ఇంత లాంగ్ కెరీర్ కొనసాగించే వారా అని ప్రశ్నించగా..? అందుకు దిల్ రాజు అది ఇంపాజిబుల్ అని సమాధానం చెప్పాడు. ఎందుకంటే 2017లో చాలా సూపర్ హిట్ సినిమాలు నిర్మాతగా తీశాను. కానీ పక్కన డిస్ట్రిబ్యూషన్ గా వ్యవహరించిన మహేష్ బాబు స్ప్రైడర్, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్ గా దాదాపు రూ.25కోట్లు నష్టపోయినట్టు చెప్పుకొచ్చాడు దిల్ రాజు.
Advertisement
Also Read : భర్త బాటలోనే నిహారిక…ఆ ఒక్కటి తప్ప అన్ని ఫోటోలు డిలీట్..!
ఇక ఆ రోజుల్లో రూ.10కోట్లు మిగిలిన సినిమా బాహుబలి. డిస్ట్రిబ్యూటర్ గా ఎక్కువగా సంపాదించామంటే అది బాహుబలి సినిమానే అని చెప్పారు. ప్రొడ్యూసర్ కంటిన్యూస్ గా సక్సెస్ సినిమాలున్నాయి కాబట్టి.. ఈ అమౌంట్ ని అటు.. ఆ అమౌంట్ ని ఇటు రొటేషన్ చేయడం వల్ల ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. డిస్ట్రిబ్యూటర్లు లాంగ్ రన్ లో అసలు నిలబడలేరు. ముఖ్యంగా నేను సక్సెస్, ఫెయిల్యూర్ రెండింటిని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. దసరా సినిమా ఇవాళ ప్లస్ అంటే మాకు కుదరదు. నెక్ట్స్ వచ్చే సినిమాలో మాకు నష్టాలు రావచ్చు. ఇలా అన్ని సినిమాలు హిట్స్ కావు కదా అని చెప్పుకొచ్చారు నిర్మాత దిల్ రాజు.
Also Read : జల్సా సినిమా హీరోయిన్ పార్వతీ మెల్టన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?