Home » డీజే టిల్లు సినిమా ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా..!

డీజే టిల్లు సినిమా ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా..!

by Anji
Ad

సాధార‌ణంగా ప్ర‌స్తుతం చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా సినిమాల‌ను కంటెంట్‌తో తెర‌కెక్కిస్తే చిన్న సినిమా అయినా స‌రే సూప‌ర్ హిట్ సాధిస్తోంది. కంటెంట్ లేకుండా ఎంత పెద్ద సినిమా తీసినా వృథా అని చెప్ప‌క‌నే చెప్ప‌వ‌చ్చు. ఇటీవ‌లే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూర్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాణంలో ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ తెర‌కెక్కించిన మూవీ డీజే టిల్లు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించార‌నే చెప్ప‌వ‌చ్చు. డీజే టిల్లు పాట తెలుగు రాష్ట్రాల్లో మారు మ్రోగుతూనే ఉంది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించింది.

Advertisement

Advertisement

ఇక సినిమాతో సిద్ధు కెరీర్ ట‌ర్న్ తీసుకున్న‌ద‌నే చెప్ప‌వచ్చు. ఈ నేప‌థ్యంలోనే డీజే టిల్లుకు సెకండ్ పార్ట్ చిత్రీక‌రించాల‌ను సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే డీజే టిల్లు చిత్రానికి మొత్తం రూ.8కోట్లు ఖ‌ర్చు చేయ‌గా.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. ఈ త‌రుణంలోనే ఈ సినిమా మొత్తం రూ.30.30 కోట్ల గ్రాస్ సాధించింది. రూ.17.25 కోట్ల షేర్ వ‌చ్చింది. తెలంగాణ‌, ఏపీలో ఈ సినిమా రూ.24.52 కోట్ల గ్రాస్‌ను రూ.14.14 షేర్ ను సాధించింది. ఈ చిత్రానికి ఇంత రెస్పాన్స్ ల‌భిస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఈ ఏడాది విడుద‌లైన చిన్న చిత్రాల్లో డీజే టిల్లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది.

 


ఈ సినిమాలో సిద్ధు చెప్పిన డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఆయ‌న త‌న న‌ట‌న‌తోనే ఈ చిత్రాన్ని హిట్ చేశార‌నే చెప్ప‌వ‌చ్చు. అదేవిధంగా నేహాశెట్టి కూడా గ్లామ‌ర‌స్ క‌నిపించి అద‌ర‌గొట్టేసింది.అయితే డీజే టిల్లు-2 మూవీకి ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా గురించి త్వ‌ర‌లోనే ఒక అప్‌డేట్ రానున్న‌ట్టు స‌మాచారం. ఇక డీజే టిల్లు -2 సినిమా ఉంటుందా లేదా అనేది మ‌రికొద్ది రోజుల్లోనే తెలియ‌నుంది.

Also Read : 

బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్.. అది ఏంటో తెలిస్తే మీరు షాకవుతారు..!!

కెరీర్ ప్రారంభంలోనే ఒకే ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టిన‌ నంద‌మూరి హీరో ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading