న్యూ ఇయర్ త్వరలోనే రాబోతుంది. మరో 20 రోజుల్లోనే న్యూ ఇయర్ వస్తుంది. అయితే…న్యూ ఇయర్ కి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. కానీ ఈ ఏడాదిని క్రికెట్ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే టీమిండియా వన్డే ప్రపంచ కప్ లో ఓడిపోవడం అత్యంత చేదు జ్ఞాపకంగా భావిస్తున్నారు. మరో బాధాకర విషయం ఏమిటంటే ఈ ఇయర్ చాలామంది ప్లేయర్స్ క్రికెట్ కి వీడ్కోలు పలికారు.
కొందరు వన్డేలకు గుడ్ బై చెప్తే మరికొందరు టెస్టులనుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాకు చెందిన డ్వేన్ ప్రీటోరియస్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడితో పాటు లెజెండరీ క్రికెటర్ హసీం ఆమ్లా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే 2007 t20 ప్రపంచ కప్ లో భారత్ ను విజేతగా నిలిపిన జోగేందర్ శర్మ కూడా క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. మురళి విజయ్, మనోజ్ తివారి, అంబటి రాయుడు కూడా ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించారు.
Advertisement
ఆస్ట్రేలియా ఆటగాడు అరుణ్ ఫించ్ మరియు ఇంగ్లీష్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, ఆల్ రౌండర్ మోయిన్ ఆలీ కూడా ఈ సంవత్సరం క్రికెట్ కి గుడ్ బై చెప్పారు. ఈ సంవత్సరం చాలామంది ప్లేయర్స్ క్రికెట్ కి గుడ్ బై చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ వుల్ హాక్ సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రింట్ అండ్ టికాక్ మరియు ఇంగ్లీష్ బౌలర్ డేవిడ్ విల్లే కూడా ప్రపంచ కప్ తర్వాత రిటైర్ అయ్యారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.