Home » రైలు హారన్ లో ఎన్ని అర్థాలు దాగి ఉన్నాయో తెలుసా ?

రైలు హారన్ లో ఎన్ని అర్థాలు దాగి ఉన్నాయో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అనగానే టక్కున గుర్తుకొచ్చేది ఇండియన్ రైల్వేనే. ఎందుకంటే ప్రతిరోజు రైలులో లక్షల మంది ప్రయాణిస్తుంటారు. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే రైలు ప్రయాణం సాఫీ సాగిపోతుంటుంది. టికెట్ ధరలు కూడా చౌకగా ఉండడంతో సామాన్యులు ఎక్కువగా రైలులోనే ప్రయాణిస్తుంటారు. భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సదుపాయాలను ఏర్పాటు చేస్తూనే ఉంటుంది. 

Also Read :  మామిడి తొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

Advertisement

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనపు రైళ్లు నడపడం, మరిన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతూనే ఉంటుంది. చాలా మంది రైలులో ప్రయాణించినా కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము. మన చుట్టూ జరిగేవి వాటిలో అర్థాలు చాలానే ఉంటాయి. మనం వాటిని అంతగా గమనించం. మనకు తరచుగా వినిపించే రైల్వేస్టేషన్ లో హారన్. స్టేషన్ కు చేరే ముందు కానీ, క్రాసింగ్ ల వద్ద రైలు డ్రైవర్ హారన్ మోగిస్తుంటాడు. అన్ని హారన్స్ ఒకేవిధంగా వినిపించినా.. వాటిలో చాలానే అర్థాలుంటాయి. రైలు ఇచ్చే హారన్ లో అర్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Also Read :  వేసవిలో సోరకాయ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఎన్నో !

Advertisement

  • స్టేషన్ లో ఉన్న రైలు చిన్న హారన్ ఇచ్చిందంటే రైలు స్టేషన్ నుంచి బయలు దేరడానికి సిద్ధంగా ఉందని అర్థం. 
  • ట్రైన్ కిచెన్ లో మోటార్ మ్యాన్ గార్డుకు సిగ్నల్ ఇవ్వడానికి ఒక షాట్ హారన్ ఇస్తాడు. దీంతో గార్డు చెక్ చేసి ట్రైన్ కదలడానికి సిగ్నల్ ఇస్తాడు. 
  • మూడు సార్లు షాట్ హారన్ ఇచ్చాడంటే అది మోటార్ మ్యాన్ అదుపు తప్పిందని అర్థం. వార్డు వ్యాక్యుమ్ బ్రేక్ ను లాగుతాడు. దీంతో ట్రైన్ ఆగిపోతుంది. 
  • నాలుగు సార్లు షాట్ హారన్ ఇచ్చాడంటే ట్రైన్ లో ఏదో సాంకేతిక లోపం ఉందని అర్థం. ట్రైన్ స్టేషన్ నుంచి వెళ్లదని తెలపడానికి ఈ సిగ్నల్ ఇస్తారు. 
  • రెండు లాంగ్ హారన్ లు, రెండు షాట్ హారన్ లు ఇచ్చాడంటే.. ఆ రైలు మోటార్ మ్యాన్ కంట్రోల్ నుంచి గార్డు కంట్రోల్ లోకి తీసుకుంటున్నట్టు అర్థం. 
  • ఒకవేళ వరుసగా హారన్ మోగుతున్నట్టయితే ఆ స్టేషన్ లో రైలు ఆగదని అర్థం. 
  • రైలు రెండు సార్లు ఆగి, రెండు సార్లు హారన్ మోగిస్తే అది రైల్వే క్రాసింగ్ దాటుతుందని అర్థం. 
  • రెండు షాట్ హారన్, ఒక లాంగ్ హారన్ మోగిస్తే.. ఎవరో చైన్ లాగాడని అర్థం. రైలుకు ఏదైనా ప్రమాదం వస్తే ఆరు సార్లు షాట్ హారన్స్ మోగిస్తారు. రైలు హారన్ మోగించడంలో ఇన్ని అర్థాలున్నాయని గుర్తుంచుకోవాలి. 

Also Read :  గీతాంజలి చిత్రంలో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పిన నటి ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading