టాలీవుడ్ హాట్‌బ్యూటీ శ్రీరెడ్డి పేరు తెలుగు ప్రేక్షకుల మదిలో గత మూడు నాలుగేళ్ల నుంచి ఎంతగానో నానుతున్న విషయం తెలిసిందే. అసలు ఏమాత్రం ఎవ్వరికీ తెలియని శ్రీరెడ్డి ఒక్కసారిగా కాంట్రవర్సీ క్వీన్‌గా మారి మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో నానా రచ్చ క్రియేట్ చేస్తూ ఒక్కసారిగా పాపుల్ అయిపోయింది. శ్రీరెడ్డి ఏమి చేసినా, ఏమి చెప్పినా కూడా వినేందుకు ఆమెకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. సినిమాల గురించి అయినా, రాజకీయాల గురించి అయినా ఆమె మనసులో ఏమి ఉందో దానిని బోల్డ్‌గానే కుండబద్దలు కొట్టిపారేస్తుంది.
Advertisement
ఆమె వీడియోలకు యూట్యూబ్‌లో ఎంత క్రేజ్ ఉందో వ్యూస్, కామెంట్స్ చెబుతున్నాయి. శ్రీరెడ్డి హైదరాబాద్‌లో ఉండటంతో పాటు అటు చెన్నైలో కూడా ఉంటున్నది. చాలా మందికి ఆమె ఆస్తులు బాగానే కూడబెట్టకుందని, ఆమె ఖరీదైన అపార్టుమెంట్లు, కార్లు ఉన్నాయని అనుకుంటున్నారు. దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఓ యాకంర్ హైదరాబాద్ రెండు డబుల్, త్రిబుల్ బెడ్‌రూంలతో పాటు బీఎండబ్ల్యూ , ఆడికార్లు ఉన్నాయట కదా అని ప్రశ్నించాడు..?
Advertisement
శ్రీరెడ్డి ఆ ప్రశ్నకు సమాధానంగా.. హైదరాబాద్‌లో మాత్రమే తనకు సొంత ఇల్లు ఉందని, ఒక ఆడీ కారు ఉన్నదని చెప్పింది. మిగిలిన ఆస్తులేమి లేవు అని వెల్లడించింది. చెన్నైలో అద్దెకు ఉంటున్న ఇళ్లు ఒక అపార్టుమెంట్‌లో చాలా చిన్నదని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. తల్లిదండ్రుల సపోర్టు లేని అమ్మాయిలకు సొంత ఇళ్లు అయినా ఉండాలని.. రేపటి రోజున ఎవడో ఒకడు వచ్చి నువ్వు అలా ఇలా చేస్తున్నావ్.. ఇళ్లు ఖాళీ చేయ్ అనిపించుకునే బాధ ఉండదు అని పేర్కొంది. తాను ఇంట్లో చాలా స్వేచ్ఛగా ఉంటానని, తనకు నచ్చిన బట్టలు వేసుకుని ఉంటానని వివరించింది. ముఖ్యంగా తనకు సొంత ఇళ్లు లేకపోతే కచ్చితంగా తాను అద్దెకు ఉండే ఇంటిని కాంట్రవర్సీల మధ్య ఖాళీ చేయించేస్తారు అని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.