Home » రోజుకు ఎన్ని బాదం గింజలు తినాలో మీకు తెలుసా ?

రోజుకు ఎన్ని బాదం గింజలు తినాలో మీకు తెలుసా ?

by Anji
Ad

బాదంలో ఎన్నో రకాల  పోషకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. దీనిపై అవగాహన పెరగడంతో నేడు చాలా మంది బాదం తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఖరీదైనవే అయినా ఆరోగ్యం కోసం చేసే ధోరణి పెరుగుతోంది. మరి రోజులో ఎన్ని బాదం గింజలు తినాలి.? ఇది చాలా మందికి సమాధానం లేని ప్రశ్న. దీనికి సమాధానం కనుగొనేందుకు ఓ అధ్యయనం జరిగింది. దీనికి లండన్ లోకి కింగ్స్ కాలేజ్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ డాక్టర్ అలైస్ క్రీడలు మార్గదర్శిగా వ్యవహరించారు. అధ్యయన ఫలితాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురితమయ్యాయి.

Advertisement

బ్యూటీరేట్ ఆమ్లం పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెద్ద పేగులో కణాలకు ఇది ఇంధనంగా పనిచేస్తుంది. దీంతో పెద్ద పేగులో కార్యకలాపాలు చక్కగా సాగేందుకు సహాయపడుతుంది. పోషకాలను సంగ్రహించాలంటూ పేగులకు సంకేతాలు కూడా పంపిస్తుంది. పేగుల్లో ఉత్పత్తి అయిన బ్యూటిరెట్ రక్త ప్రవాహంలోకి ప్రవేశించి కాలేయం, మస్తిష్కం ఊపిరితిత్తుల్లోనూ ఆరోగ్యవంతమైన కార్యకలాపాలకు సాయపడుతుంది అని క్రీడన్ వివరించారు.  బ్యూటీరేట్ ను పెంచే గుణం భాదానికి ఉంది. అందుకే రోజుకు ఎన్ని గ్రాముల బాదం అవసరం, అసలు  బ్యూటీరేట్ చేసే మంచి ఏంటన్న దానిపై ఈ అధ్యయనం దృష్టి పెట్టింది. రోజువారి 56 గ్రాముల బాదం గింజలు తినడం వల్ల బుటీరేట్ పెరుగుతున్నట్టు గుర్తించారు.

Advertisement

Also Read :  రాజబాబు నుంచి సుకుమార్ వరకు ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీరే..!

ఈ అధ్యయన ఫలితాలపై నానావతి ఆసుపత్రి న్యూట్రిషన్ విభాగం హెడ్ ఉషాకిరణ్ సిసోడియా స్పందించారు. బాదం లో బీ కాంప్లెక్స్ విటమిన్లు అయినా బీ1 , బీ2 , బీ3 , ఫోలేట్ , బీ9 మంచి కొవ్వులు , మినరల్స్ ఉంటాయి. ఒక ఔన్స్ బాదం గింజలు (సుమారు 23 బాదం గింజలు) తినడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ప్లాంట్ ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం తగినంత బాదం ద్వారా లభిస్తాయి అని వివరించారు. బాదంతో కొలెస్ట్రాల్ తగ్గుతుందని, రక్తంలో షుగర్ నియంత్రణలో ఉంటుందని, కొన్ని రకాల కేన్సర్ ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కనీసం 20 బాదం గింజలు తినడం మంచిదని సూచిస్తున్నారు.

Also Read :   అర్థరాత్రి తినేవారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదముంది జాగ్రత్త..!

Visitors Are Also Reading