Home » బాహుబలి మూవీ షూటింగ్ ఎలా తీసారో తెలుసా.. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..!

బాహుబలి మూవీ షూటింగ్ ఎలా తీసారో తెలుసా.. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా చేసినా గొప్ప తెలుగు డైరెక్టర్ రాజమౌళి అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఇండస్ట్రీని చిన్న చూపు చూసినవారికి చెంపపెట్టులా తెలుగోడి సత్తా ఏంటో చూపించారు దర్శక ధీరుడు. అలాంటి ఆయన దర్శకత్వంలో వచ్చిన క్రేజీ ప్రాజెక్టు బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం అందరి చేత ప్రశంసలు అందుకొని, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును సాధించింది. 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది.

Advertisement

Also Read:వెంకటేష్ మల్లీశ్వరి చిత్రంలో చేసిన ఈ చిన్న పాప గుర్తుందా.. ఇప్పుడెలా ఉందంటే..?

2015 జులై 10న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే కన్నార్పకుండా చూస్తారు. ఈ సినిమాలో సీన్స్ ఎన్నో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు రాజమౌళి. అయితే ఈ సినిమాలో బాహుబలి విగ్రహాన్ని పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ సీన్ వస్తుందని సంగతి తెలిసింది. అయితే దర్శకుడు మొదట ఇంటర్వెల్ సీనును మరోచోట వేద్దామని అనుకున్నారట. కానీ విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ సీన్ వస్తే బాగుంటుందని చెప్పడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. బాహుబలి ది బిగినింగ్ లో కోతి నగల మూట తీసుకొని వస్తే ఆ నగలను చూసి అవంతిక రూపం చెక్కేలా ఒక సీన్ రాజమౌళి రాసుకున్నారు.

Advertisement

Also Read:చిరంజీవి వల్లే నా కెరియర్ నాశనమైంది.. బుల్లితెర మెగాస్టార్ రాజ్ కుమార్..!!

అయితే కోతి విషయంలో సెన్సార్ వాళ్ళ నుంచి అభ్యంతరాలు రావడంతో ఆ సన్నివేశం విషయంలో మార్పులు జరిగాయని సమాచారం. అయితే ఈ చిత్రం కోసం తమిళ రచయిత మదన్ కార్కి కిలికిలి లేదా కిలికి అనే పేరుతో కొత్త భాషను రూపొందించగా ఇది చాలా ఫేమస్ అయింది. ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. 15వేల స్టోరీ బోర్డు స్కెచ్ ను రూపొందించారు. ఒక ఇండియా సినిమాకు ఇంతటి ఫ్రీ ప్రొడక్షన్ పనులు ఇదే మొదటిసారి. అలాగే ఈ సినిమా కోసం అనుష్క, రానా ప్రభాస్ కత్తి సాము చేయడం నేర్చుకున్నారు.. మొత్తానికి సినిమా రిలీజ్ అయి చరిత్ర క్రియేట్ చేసి అవార్డుల పంట పండించింది.

Also Read:5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!

 

Visitors Are Also Reading