యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజ్ మలయాలంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని దర్శకుడు కే.రాఘవేందర్ రావు ని సంప్రదించారు. ప్రముఖ నిర్మాత ఒకరు రెబల్ స్టార్ చెల్లెలి సెంటిమెంట్ ఉన్న చిత్రాన్ని తీస్తున్నారు. వర్కవుట్ అవుతుందా అని రాఘవేంద్ర రావుని తరుచూ అడిగేవాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో అమరదీపం సినిమా తీయడమే కాదు.. అవార్డు తీసుకొచ్చేవిధంగా చేస్తానని హామీ ఇచ్చాడు దర్శకేంద్రుడు. అలా 1977లో గోపికృష్ణ మూవీస్, సూర్యనారాయణరాజ్ నిర్మాణంలో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అమరదీపం విడుదలైంది. ఈ సినిమాలో కృష్ణంరాజు, జయసుధ హీరో, హీరోయిన్లుగా నటించారు.
Advertisement
ఈ సినిమాలో కృష్ణంరాజును దొంగతనం వృత్తిగా ఉన్న సత్యానారాయణ పెంచుతాడు. పెద్దవాడు అయిన కృష్ణంరాజు ధనికుడు అవుతాడు. తన దగ్గరే పని చేసే జయసుధను ప్రేమిస్తాడు. జయసుధ, మురళీమోహన్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అంతేకాదు.. దుర్మార్గపు వృత్తిలో ఉన్న కృష్ణంరాజు అంటే జయసుధ ఇష్టపడదు. కోపంతో మురళి మోహన్ తన తమ్ముడు అన కృష్ణంరాజుకి తెలుస్తోంది. వారిద్దరికీ పెళ్లి జరిపిస్తాడు. జయసుధపై కృష్ణంరాజు ప్రేమ గురించి తెలుసుకున్న మురళీ మోహన్ అపార్థంతో అతన్ని ద్వేషిస్తాడు. ప్రేమించిన జయసుధ, తన వాళ్ల కోసం కృష్ణంరాజు ఆత్మహత్య చేసుకుని అమరదీపం అవుతాడు.
Advertisement
ఈ సినిమా ఘన విజయం సాధించడంతో నిర్మాత సూర్యనాారాయణ రాజ్ మూవీ శత దినోత్సవాన్ని విజయవాడలో ఏర్పాటు చేసారు. చెల్లెలు సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీని మహిళా ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు.ఈ మూవీ శత దినోత్సవానికి ఓ మహిళ చంటిబిడ్డతో కృష్ణంరాజు ఉన్న స్టేజీ వద్దకు చేరుకుంది. కృష్ణంరాజు బిడ్డతో ఇంత జన సందోహంలో వస్తున్నావు. ఆ చంటి పిల్లవాడికి ఏమి కాదా అన్నట్టుగా అడిగారు. నిన్ను చూసే భాగ్యం కలుగుతుందా అని అనడం కృష్ణంరాజును కదిలించింది. ఈ మూవీతో ప్రారంభం అయిన రాఘవేంద్రరావు, కృష్ణంరాజు కాంబినేషన్ ఆ తరువాత పలు సూపర్ హిట్ సినిమాలు తీసారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
The Kerala Story : ఆదాశర్మ ఫోన్ నంబర్ లీక్.. ఫోన్ చేసి బూతులు!
కరాటే కళ్యాణికి ఝలక్ ఇచ్చిన ‘మా’.. అందుకోసమేనా ?