Telugu News » Blog » న‌టి కె.ఆర్ విజ‌య కూతురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్న సంగ‌తి తెలుసా..? ఆమె ఎవ‌రంటే..!

న‌టి కె.ఆర్ విజ‌య కూతురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్న సంగ‌తి తెలుసా..? ఆమె ఎవ‌రంటే..!

by AJAY
Ads

టాలీవుడ్ లో న‌టిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కేఆర్ విజ‌య ప్ర‌స్తుతం అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళ భాష‌ల్లో హీరోయిన్ గా రాణించారు. విజ‌య అమ్మ‌వారి పాత్ర‌ల‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎక్కువ‌గా ద‌గ్గ‌ర‌య్యారు. ఇక ఇండ‌స్ట్రీలో వార‌సుల ఎంట్రీ కామ‌న్ అయితే కేఆర్ విజ‌య ఫ్యామిలీ నుండి త‌న చెల్లెల్లు మ‌రియు కూతుళ్లు కూడా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చార‌న్న సంగ‌తి చాలా త‌క్కువ మందికి తెలుసు.

Advertisement

 

కేఆర్ విజ‌య చెల్లి సావిత్రి మ‌ల‌యాళంలో హీరోయిన్ గా న‌టించారు. అయితే సావిత్రి కేవ‌లం మ‌ల‌యాళ సినిమాలకు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. కేఆర్ విజ‌య తండ్రి ఏపీకి చెందిన వ్య‌క్తి కాగా ఆమె త‌ల్లి కేర‌ళ రాష్ట్రానికి చెందిన‌వారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఇదిలా ఉంటే కేఆర్ విజ‌య ఇద్ద‌రు కూతుళ్లు కూడా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె కూతురు అనూష హీరోయిన్ గా ప‌రిచ‌యం అయ్యారు. అంతే కాకుండా మ‌రోకూతురు మ‌ణిరాగ సుధ కూడా న‌టిగా ప‌రిచ‌యం అయ్యారు.

Advertisement

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాషల్లో సినిమాల్లో న‌టించారు. కేవ‌లం కూతుళ్లు చెల్లెల్లే కాదు కేఆర్ విజ‌య బంధువుల్లో కూడా చాలా మంది సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే కేఆర్ విజ‌య కూతురు అనూష‌ ప‌ద‌మూడేళ్ల‌కే మ‌ల‌యాళంలో ఎంట్రీ ఇచ్చారు. ఆమె టాలెంట్ చూసిన ద‌ర్శ‌కుడు హీరోయిన్ గా అవ‌కాశాలు ఇచ్చారు. అలా అంచెలంచెలుగా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

ఆ తర‌వాత తెలుగులోనూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేశారు. ఇద్ద‌రు పెళ్లాల ముద్దుల పోలీస్, గోల్ మాల్ గోవిందం తో పాటూ మ‌రికొన్ని సినిమాల్లో న‌టించినా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు అనూష చేరుకోలేదు. ఇక ప్ర‌స్తుతం అనూష క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొన‌సాగిస్తున్నారు. అంతే కాకుండా సినిమాల కంటే ఎక్కువ‌గా సీరియ‌ల్స్ లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు.

Advertisement

ALSO READ : ద‌మ్ముంటే ఆ ప‌ని చెయ్…న‌రేష్ కు రెండో భార్య స‌వాల్..!