Home » వాట్సాప్ లో కొత్త ఫీచర్ గురించి తెలుసా ? ఇక నుంచి అలాంటివి కుదరవు..!

వాట్సాప్ లో కొత్త ఫీచర్ గురించి తెలుసా ? ఇక నుంచి అలాంటివి కుదరవు..!

by Anji
Ad

ప్రస్తుతం స్మార్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సాప్ వాడడం మనం చూస్తూనే ఉన్నాం. వాట్సాప్ లేని ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు.. మనిషి జీవితంలో వాట్సాప్ అంతలా భాగం అయిపోయింది. వాట్సాప్ కూడా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఫీచర్ ఏంటంటే.. ఇక నుంచి ఎవరైనా మెసేజ్ పంపించినట్టయితే దానిని ఒక్కసారి మాత్రమే చూసుకునే అవకాశం ఉంది. ఆ తరువాత ఆ మెసేజ్ కనిపించకుండా పోతుంది. 

Advertisement

ఆ మెసేజ్ పంపించిన వారికి, అందుకున్న వారికి ఆటోమెటిక్ గా ఆ మెసెజ్ డిలీట్ అవుతుంది. ఆ ఫీచర్ పేరు వ్యూ వన్స్ మెసెజ్ ఫీచర్. ఇప్పటి నుంచి ఎవరైనా మనకు మెసేజ్ చేస్తే ఫార్వర్డ్ చేయడం అసలు కుదరదు. ఇక నుంచి ఎవరైనా మనకు మెసేజ్ పంపించితే దానిని ఫార్వర్డ్ చేయడం అసలు కుదరదు. ఈ ఫీచర్ రాకముందు వాట్సాప్ అకౌంట్ లో సభ్యులు చేసే చాట్ కొద్ది సమయం తరువాత ఆటోమెటిక్ గా డిలీట్ అయ్యేవిధంగా డిసపియరింగ్ అనే ఫీచర్ వచ్చింది.

Advertisement

Also Read :  ఉదయం వేళలో వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

Manam News

ఇక ఇప్పటికే వాట్సాప్ లో వ్యూ వన్స్ ఫీచర్ ఫోటోస్, వీడియోలు వాడకంలో ఉంది. ఫోటోలు లేదా వీడియోలకు వ్యూ వన్స్ ఫీచర్ ని ఎంచుకున్నట్టయితే ఒకసారి మాత్రమే అది కనిపించి ఆ తరువాత కనిపించకుండా పోతుంది. దీనిని స్క్రీన్ షాట్ తీయడం అసలే కుదరదు. ఇదే ఫీచర్ ని టెక్ట్స్ మెసేజ్ కి వచ్చేవిధంగా చేయాలని వాట్సాప్ ఆలోచిస్తుంది. టెక్ట్స్ ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్ అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒక సెండ్ బటన్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూసర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ త్వరలోనే పూర్తి స్థాయిలో వినియోగదారులందరికీ అందుబాటులో తీసుకురానున్నది. ఎప్పుడొస్తుంది అనేది మాత్రం వెల్లడించలేదు. 

Also Read :  ‘పోకిరి’ లాంటి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తో తీసిన సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఏదో తెలుసా ?

Visitors Are Also Reading