Telugu News » Blog » 2023 రిపబ్లిక్ డే ప్రత్యేకత గురించి మీకు తెలుసా ?

2023 రిపబ్లిక్ డే ప్రత్యేకత గురించి మీకు తెలుసా ?

by Anji
Ads

భారతదేశంలో 1950 నుంచి ప్రతి ఏడాది జనవరి 26 ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటోంది. జనవరి 26, 2023న భారతదేశం తన 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతుంది. దీనిని గణతంత్ర దివాస్ అని కూడా పిలుస్తారు. జనవరి 26, 1950న రాజ్యాంగం అమలులోకి రావడంతో దాన్ని గౌరవిస్తూ.. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో సహా దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. ప్రతి  ఏడాది ప్రధాన గణతంత్ర దివాస్ ను జనవరి 26న న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లేదా కర్తవ్య మార్గంలో నిర్వహిస్తారు. 

Advertisement

భారత సైన్యం, భారత నౌకాదళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భాగస్వామ్యంతో జనవరి 26న విస్తృతమైన రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది. దీనిని టీవీ లో ప్రత్యక్షంగా చూడవచ్చు. లేదా వ్యక్తిగతంగా చూడటానికి ఢిల్లీలో జరిగే ఈ వేడుకకు హాజరు కావచ్చు. ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్- సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ 2023 ప్రత్యక్ష ప్రసారం కర్తవ్య పథ్ నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. ఎప్పటి మాదిరిగానే ప్రధాని అమర్ జవాన్ జ్యోతిని సందర్శించారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత గణతంత్ర దినోత్సవ పరేడ్ నిర్ణీత సమయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ పథ్ వెంట ఇండియా గేట్ వరకు అక్కడి నుంచి ఎర్రకోట వరకు సాగుతుంది. ఈ మార్గం ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. 

Also Read :   డబ్బు కోసం యాంకర్ సుమ కూడా ఇలా చేస్తుందా..?

Advertisement

Manam News

ప్రభుత్వం 2023 రిపబ్లిక్ డే పరేడ్ లో వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన కోసం మూడు నిర్దిష్ట థీమ్ లను ప్రతిపాదించింది. అవి ఇండియా 75, అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం, నారీశక్తి రాష్ట్రాల శకటాలు.. ఈ మూడు థీమ్ లలో ఒకటి ఎంచుకునే అవకాశముంది. లేదా మూడింటిని కూడా ఎంచుకోవచ్చు. భారతదేశం రాజ్యాంగాన్ని జనవరి 26, 1950న ఆమోదించడంతో భారత్ సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ 21 తుపాకుల వందనం స్వీకరించారు. భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలా ఈ చరిత్రాత్మక దినోత్సవం ఆవిర్భవించింది. భారత సాయుధ దళాల కమాండర్- ఇన్- చీఫ్ అయిన భారత రాష్ట్రపతి జనవరి 26న గౌరవ వందనం స్వీకరిస్తారు. 

Also Read :   దర్శకుడు రాజమౌళి తీసుకునే పారితోషికంతో ఎక్కువ దేని కోసం ఖర్చు చేస్తారో తెలుసా ?

MANAM NEWS

రిపబ్లిక్ డే పరేడ్ లో భారత దేశంలోని వివిధ పారా- మిలటరీ బలగాలు, ఇతర పౌర బలగాలకు చెందిన వివిధ బృందాలు పాల్గొంటాయి.రిపబ్లిక్ డే ఉత్సవాల ముగింపును అధికారికంగా సూచించిన తర్వాత బీటింగ్ రిట్రేట్ వేడుక నిర్వహిస్తారు. ఇది రిపబ్లిక్ డే తర్వాత మూడో రోజు అనగా.. జనవరి 29 సాయంత్రం నిర్వహిస్తారు. దీనిని మిలిటరీకి చెందిన మూడు విభాగాలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ లు ప్రదర్శిస్తాయి. వేదిక రైసినా హిల్, పక్కనే ఉన్న స్క్వేర్, విజయ్ చౌక్, రాజ్ పథ్ చివరలో రాష్ట్రపతి భవన్ యొక్క ఉత్తర, దక్షిణ బ్లాక్ ల చుట్టూ ఉంటుంది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగాన్ని ఆమోదించబడినప్పుడు జనవరి 26ను గణతంత్ర వేడుకలకు అనువైన తేదీగా నిర్ణయించారు. అలా జనవరి 26, 1950 మన గణతంత్ర దినోత్సవంగా మారింది.

Advertisement

Also Read :   Jr..ఎన్టీఆర్ ను ఇంట్లో పిలిచే నిక్ నేమ్ ఏంటో తెలుసా..?