Home » న‌రేష్ మాజీ భార్య‌ల గురించి మీకు తెలుసా..? వారికి పిల్ల‌లు ఎంత‌మందంటే..?

న‌రేష్ మాజీ భార్య‌ల గురించి మీకు తెలుసా..? వారికి పిల్ల‌లు ఎంత‌మందంటే..?

by Anji
Ad

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ పేర్లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. సినిమాల‌తో న‌రేష్‌కి మంచి గుర్తింపు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం పెళ్లిళ్ల‌తో తెగ వైర‌ల్ అవుతున్నారు. చాలా మందికి ఆయ‌న‌కు మూడు పెళ్లిళ్లు జ‌రిగాయ‌ని తెలిసిందే. ఇప్పుడు ఈయ‌న ప‌విత్ర లోకేష్‌తో చ‌ట్ట‌స‌భ‌లు వేసుకుని తిర‌గ‌డంతో ఈయ‌న పెళ్లిళ్ల బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. ప‌విత్ర లోకేష్ స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో న‌రేష్ ముందు చేసుకున్న పెళ్లిల గురించి, మాజీ భార్య‌ల గురించి నెటిజ‌న్లు ఆరా తీస్తున్నారు.

Advertisement

విజ‌య‌నిర్మ‌ల మొద‌టి భ‌ర్త కృష్ణ‌మూర్తికి పుట్టిన సంతానం. చాలా మంది తెలియ‌క కృష్ణ కుమారుడ‌నే అనుకుంటారు. కానీ అది పొర‌పాటు. విజ‌య‌నిర్మ‌ల ఆమె మొద‌టి భ‌ర్త‌తో విడాకులు తీసుకుని సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను రెండ‌వ పెళ్లి చేసుకుంది. కృష్ణ కూడా త‌న మొద‌టి భార్య ఇందిరాదేవిని ఒప్పించి రెండ‌వ పెళ్లి విజ‌య‌నిర్మ‌ల‌ను చేసుకున్నాడు. చిన్న వ‌య‌సులోనే సినిమాల్లోకి వ‌చ్చిన న‌రేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆ త‌రువాత హీరోగా త‌ల్లి విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేశారు. ఇక డ్యాన్స్ మాస్ట‌ర్ శ్రీ‌ను గారి అమ్మాయితో పెళ్లి జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు ఒక కుమారుడు న‌వీన్ విజ‌య‌కృష్ణ ఉన్నారు. అయితే తాను సినిమాల్లోకి హీరోగా నందిని న‌ర్సింగ్ హోమ్ సినిమా ద్వారా ప‌రిచ‌యం అయ్యాడు. న‌రేష్ మొద‌టి భార్యకు, న‌రేష్ కి భేదాభిప్రాయాలు రావ‌డంతో వారు విడిపోయారు.

Advertisement

ఇక ఆ త‌రువాత న‌రేష్ మ‌ళ్లీ రెండో పెళ్లి దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి మ‌న‌వ‌రాలు రేఖ సుప్రియను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక‌బ్బాయి తేజ. ఇత‌ను చిత్ర‌కారుడు. ప్ర‌స్తుతం ఆనిమేష‌న్ నేర్చుకుంటున్నాడు. వీరిద్ద‌రికీ గొడ‌వ‌లు రావ‌డంతో వీరు విడిపోయారు. విడిపోయిన త‌రువాత కూడా రేఖ సుప్రియ‌తో క‌లిసి చెన్నైలోని ఓ ఎన్జీఓ కోసం ఇప్ప‌టికీ వీరు క‌లిసి ప‌ని చేస్తున్నారు. న‌రేష్‌2010లో మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. ర‌మ్య‌ర‌ఘుప‌తి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్, ర‌ఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె. ఈమెతో కూడా మ‌న‌స్పార్థాలు రావ‌డంతో విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేశారు. వీరికి ముగ్గురు మ‌గ పిల్ల‌లున్నారు. ఇక ఇప్పుడు ర‌మ్య ర‌ఘుప‌తితో దూరంగా ఉంటూ ప‌విత్ర‌ లోకేష్ తో స‌హ‌జీవ‌నం చేస్తుండ‌డంతో వివాదాలు త‌లెత్తుతున్నాయి.

Also Read : 

చంద్రమోహన్ ఫ్యామిలీ సినిమాలకు ఎందుకు దూరంగా ఉందో తెలుసా…?

ఆట 4 విన్నర్ “గీతిక” మీకు గుర్తుందా.. మరి ఇలా మారిపోయిందేంటి..?

 

Visitors Are Also Reading