Home » అన్నం తినేటప్పుడు మీ పిల్లలను తిడుతున్నారా.. అయితే చాలా పెద్ద దోషం చుట్టుకున్నట్టే..?

అన్నం తినేటప్పుడు మీ పిల్లలను తిడుతున్నారా.. అయితే చాలా పెద్ద దోషం చుట్టుకున్నట్టే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే చాలా మంది పిల్లల్ని భోజనం చేసే సమయంలో తిడుతూ ఉంటారు. ఆ మాటల్ని భరిస్తూనే బాధపడుతూ పిల్లలు భోజనం చేస్తూ ఉంటారు. అలా ఆవేదన అనుచుకుంటూ చేసిన భోజనం ఒంట పట్టకపోగా అనేక అనారోగ్య సమస్యలు కొని తెస్తుందని పండితులు సూచిస్తున్నారు. భోజనం చేస్తున్న వారిపై ఆవేశపడడం వల్ల శాస్త్ర సంబంధమైన దోషాలు కూడా ఎదురవుతాయట. కొంతమంది మాత్రం ఆవేశాన్ని అనుచుకోలేక అన్నం కంచాన్ని విసిరి కొడుతూ ఉంటారు.

Advertisement

Advertisement

కానీ జీవితంలో ఎవరైతే అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తారో కోపంతో విసిరి కొడతారో అది వారికి దూరం అవుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో అన్నం తినడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అది చాలా ప్రమాదకరం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆమెను నిర్లక్ష్యం చేస్తే అన్నం ఎదురుగా ఉన్నా కూడా తినలేని పరిస్థితి రావచ్చు. అయితే మనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు అన్నం ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి వల్ల మనం తినలేకపోవచ్చు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నం పై విసుగు, నిర్లక్ష్యం చూపకూడదు.

ఇక కొందరు అయితే ఇంట్లో గొడవ జరిగి అలిగి అన్నం తినడం మానేస్తారు. అలా అందరూ కోపంతో కటిక ఉపవాసం చేయడం కూడా దోషమేనని పెద్దలు చెబుతుంటారు. అందువల్ల భోజన సమయంలో సాధ్యమైనంత వరకు కోపతాపాలకు పోకుండా ఉండడమే అన్ని విధాలా మంచిదని చెప్పచ్చు. భోజనం అనేది పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని ప్రశాంతంగా చేసినప్పుడే అది ఒంట పడుతుంది. అందుకే హడావిడి పడకుండా,మాట్లాడకుండా భోజనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Visitors Are Also Reading