వేసవి కాలంలో ఎండ యొక్క తీవ్రత పెరిగే కొద్దీ మనకు దాహం తాగాలనే లక్షణం బాగా పెరుగుతుంది. వేసవికాలంలో అన్నం కంటే నీళ్ళనే ఎక్కువగా తీసుకుంటాం. చాలామంది దాహం బాగా వేస్తుంది అంటూ నీళ్ళు విపరీతంగా తాగుతూ ఉంటారు. అయినా కూడా వారి దాహం తీరదు. దాహం తీరలేదని ఇంకా నీళ్లు తాగితే ఆ నీళ్లు పొట్టలో పట్టవు. ఓ పక్కన దాహం తీరదు, ఇంకో పక్కన పొట్ట లో పట్టవు. పొట్ట నిండా ఆహారం తిన్నాక నీళ్లు తాగాలని అనిపించినా కూడా నీళ్లు పట్టవు. శరీరంలో నీరు తగ్గినప్పుడు దాహం వేస్తుంది. కానీ మీరు దాహాన్ని తీర్చు కోకుండా ఆహారాన్ని తినేస్తారు. మీరు ఎన్ని నీళ్లు తాగినా మీ ఆహారంతో పాటు కలిసిపోయి పొట్టలోనే ఉంటాయి. అందుకే మీకు ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఇలాంటి పరిస్థితి నుండి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు ఆహారం తినడానికి కూర్చునే ముందే నీళ్లు తాగి కూర్చోవాలి. అప్పుడు మీ దాహం తీరుతుంది. మీరు తినడానికి ముందే నీళ్లు తాగితే రెండు మూడు గంటల వరకు దాహం అనే లక్షణం మీలో కనిపించదు. నిద్ర లేచిన వెంటనే లీటర్ నుంచి లీటర్ పావు నీళ్లను తాగాలి.ఇలా తాగడం వల్ల ఐదు నుంచి పది నిమిషాల లోపు రక్తంలో కలిసి మన శరీరంలో ఉన్న కణజాలాలకు విస్తరించి లోపల నీటి స్థాయిని బ్యాలెన్స్ చేస్తాయి కాబట్టి దాహం తీరుతుంది. ఇలా చేయడం వల్ల నీళ్లు తాగాలనే భావన రెండు మూడు గంటల వరకు రాదు. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. భోజనం చేసే ముందు ఒకేసారి లీటర్ నీళ్ళు కూడా తాగకూడదు. అలా చేస్తే ఆహారం పట్టదు. ఇలా నీళ్లు తాగే టప్పుడు ఒక క్రమపద్ధతిని పాటిస్తే మనం తాగే నీళ్లు శరీరంలో ఉన్న రక్తంలో కలిసి శరీరంలో ఉన్న నీటి స్థాయిని క్రమపరుస్తుంది.
Advertisement
ALSO READ :
Advertisement
Chanakya Niti : ఈ పనులు చేసిన వెంటనే స్నానం తప్పకుండా చేయాలి..!
మీ ఇంట్లో చిల్లర డబ్బులు ఈ ప్రదేశంలో పెడితే ఇక ధనవర్షమే..!!