Home » వ‌ర్షాకాలంలో ఇంట్లోకి ఈగ‌లు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

వ‌ర్షాకాలంలో ఇంట్లోకి ఈగ‌లు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

by Anji
Ad

వ‌ర్షాకాలంలో ఇండ్ల‌లోకి కీట‌కాలు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. ఇక రాత్రిపూట పురుగుల స‌మ‌స్య క‌నిపిస్తుంది. ప‌గ‌టిపూట ఈగ‌లు త‌రుచుగా ఇండ్ల‌లోకి వ‌స్తుంటాయి. వ‌ర్షాకాలంలో దాదాపు ప్ర‌తి ఇంట్లో ఈగ‌ల స‌మ‌స్య ఉంటుంటుంది. అయితే ఇంట్లోకి ఈగ‌లు రాకుండా ఉండాలంటే ఇల్లు అప‌రిశుభ్రంగా ఉండ‌డ‌మే కాకుండా అనేక వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు వ్యాధుల భారీన ప‌డే ప్ర‌మాద‌ముంది. కొన్ని చిట్కాల మీరు పూర్తిగా ఈగ‌ల‌ను ఇండ్ల‌లోకి రాకుండా చేయ‌వ‌చ్చు.

Advertisement

ఇంట్లో నుంచి ఈగ‌ల‌ను దూరంగా ఉంచ‌డంలో ఉప్పు వాడ‌కం చాలా ప్ర‌భావ‌వంతంగా ఉంటుంది. ఈగ‌లు ఉప్పుకు దూరంగా ఉండ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాయి. అటువంటి ప‌రిస్థితిలో 1 గ్లాస్ నీటిలో 2 టీ స్పూన్ల ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ ద్రావ‌ణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంటి అంత‌టా పిచికారీ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మీ ఇంట్లో నుంచి ఈగ‌లు వెంట‌నే మాయం అవుతాయి.

 

ఔష‌ద మూల‌కాలు స‌మృద్ధిగా ఉన్న తుల‌సి, పుదీనా కూడా ఈగ‌ల‌ను వ‌దిలించుకోవ‌డానికి బెస్ట్ ఆప్ష‌న్. తుల‌సి, పుదీనా ఆకుల‌ను గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను నీటిలో క‌ల‌ప‌డం ద్వారా ద్రావ‌ణాన్ని సిద్ధం చేయండి. ఈ ద్రావ‌ణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంట్లో పిచికారి చేయ‌డం వ‌ల్ల ఈగ‌లు ఇంట్లోకి రావు.

Advertisement


ఈగ‌లను వ‌దిలించుకోవాల‌నుకుంటే న‌ల్ల మిరియాలు, పాల‌ను ఉప‌యోగించ‌డం బెస్ట్ ఆప్ష‌న్. ఒక గ్లాస్ పాల‌లో 3 టీ స్పూన్ల పంచ‌దార‌. 1 టీ స్పూన్ న‌ల్ల మిరియాల పొడి క‌ల‌పండి. ఇది ఈగ‌లు ఉన్న ప్ర‌దేశంలో ఉంచండి. అప్పుడు ఈగ‌లు పాల వాస‌న ద‌గ్గ‌రికీ వ‌చ్చి ఈ ద్రావ‌ణంలో మునిగి చ‌నిపోతాయి.

వీన‌స్ ప్లెట్రాప్ మొక్క‌ను ఇంటి ఆవ‌ర‌ణ‌లో నాటితే వ‌ర్షాకాలంలో దోమ‌ల బెడ‌ద పోతుంది. వీన‌స్ ఫ్లెట్రాప్ ఒక కార్నివోర‌స్ ఇది కీట‌కాల‌ను ట్రాప్ చేసి వాటిని తింటుంది. అటువంటి ప‌రిస్థితిలో ఇంట్లో వీన‌స్ ఫ్లెట్రాప్ ను ఉంచ‌డం ద్వారా ఈగ‌లు ఈ మొక్క‌లో చిక్కుకుని చ‌నిపోతాయి.

Also Read : 

పుట్టిన రోజు వేడుక‌ల‌కు కేటీఆర్ దూరం.. కార‌ణం ఏమిటో తెలుసా..?

అప్పట్లో సంచలనం రేపిన అమీర్ ఖాన్ గీతాంజలి సినిమా హీరోయిన్ గొడవ..! ఎందుకు అమీర్ ఖాన్ ను ఎందుకు కోర్ట్ కి ఈడ్చింది ?

Visitors Are Also Reading