Home » శుక్ర‌వారం ఇలా చేస్తే మీ ఇంట ల‌క్ష్మీదేవి తాండ‌వం చేస్తుంది…!

శుక్ర‌వారం ఇలా చేస్తే మీ ఇంట ల‌క్ష్మీదేవి తాండ‌వం చేస్తుంది…!

by AJAY
Ad

డ‌బ్బు సంపాదించాలంటే ల‌క్ష్మీదేవి క‌టాక్షం ఉండాల్సిందే. లేదంటే ఎంత క‌ష్టప‌డినా వృథానే అవుతుంది. ఎంత సంపాదించినా ఏదో ఒక‌రూపంలో ఖ‌ర్చ‌వుతూ ఉంటుంది. అయితే ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం పొందాలంటే శుక్ర‌వారం నాడు కొన్ని స‌ల‌హాలు సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు.

Advertisement

కాబ‌ట్టి శుక్ర‌వారం నాడు ల‌క్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం….పూర్తి భ‌క్తితో శ్ర‌ద్ద‌తో శుక్ర‌వారం ల‌క్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. శుక్ర‌వారం ఎరుపు రంగు దుస్తుల‌ను ధ‌రించి ల‌క్ష్మీ దేవి ఆల‌యానికి వెళ్లాలి. అంతే కాకుండా స్త్రీలు అయితే ఎరుపు రంగు గాజుల‌ను కూడా ధ‌రించాలి. అదే విధంగా ఆల‌యానికి వెళ్లేట‌ప్పుడు ఆ ఎరుపు రంగు పూల‌ను వెంట తీసుకువెళ్లి పూజ చేయాలి.

Advertisement

ఇక ఆ పూల‌ని ఇంటికి తీసుకువ‌చ్చి అల్మారాలో లేదా బీరువాలో డ‌బ్బు దాచుకునే చోట ఉంచాలి. గుడికి వెళ్ల‌ని వాళ్లు శుక్ర‌వారం ఈశాన్యం దిక్కున ల‌క్ష్మీదేవిని పూజించి అదే రోజు సాయంత్రం స్వచ్చ‌మైన ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అంతే కాకుండా ప‌త్తికి బుద‌లుగా దీపంలో దీపాంత‌ను చేసి పెట్టాలి. అదే విధంగా దీపంలో చిటికెడు కుంకుమ‌ను కూడా ఉంచ‌వ‌చ్చు.

 

అలా ఉంచ‌డం వ‌ల్ల సంప‌ద పోగు అవుతుంది. శుక్ర‌వారం ల‌క్ష్మీదేవితో పాటూ విష్ణు పూజ కూడా చేయ‌డం వల్ల మంచి జ‌రుగుతుంది. శుక్ర‌వారం ద‌క్షిణ‌వ‌ర్థి శంఖం ను నీటితో నింపి విష్ణు మూర్తికి అభిషేకం చేస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆర్థిక సంక్షోభానికి తెర‌ప‌డుతుంది.

Visitors Are Also Reading