Home » దంతాలు పసుపుగా మారిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి..?

దంతాలు పసుపుగా మారిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి..?

by Sravya
Ad

దంతాలు పసుపు రంగులోకి మారిపోకుండా తెల్లగా ఉండాలంటే కచ్చితంగా ఇలా చేయాల్సిందే.. ప్రతి ఒక్కరు కూడా అందంగా కనపడాలని అనుకుంటారు. అయితే మనం అందంగా కనపడాలంటే మన నవ్వు కూడా బాగుండాలి. నవ్వు బాగుండాలి అంటే దంతాలు శుభ్రంగా ఉండాలి, తెల్లగా ఉండాలి. కొంతమంది దంతాలు పసుపుగా ఉంటాయి చూడడానికి బాగోదు. అయితే దంతాలు తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.. రోజు తగినన్ని నీళ్లు తీసుకోవడం చాలా ముఖ్యం దీని ద్వారా నోటిలోని బ్యాక్టీరియా దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు తొలగిపోతాయి. అలానే లాలాజలం ఉత్పత్తిని పెంచి దంతాలని నేచురల్ గా క్లీన్ చేస్తుంది.

Advertisement

సిగరెట్ అలవాటు ఉన్నవాళ్లు మానుకుంటే మంచిది లేదంటే దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయ. పొగాకు ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండాలి. దంతాలని పసుపు రంగులోకి మార్చే కాఫీ, టీ, వైన్ వంటి వాటిని మితంగా తీసుకోవాలి ఎక్కువగా వీటిని తీసుకుంటే దంతాలపై మరకలు ఏర్పడతాయి. ఒకవేళ వీటిని తాగితే వెంటనే నోటిని పుక్కిలించండి. ఏదైనా కూల్ డ్రింక్ వంటి వాటిని తీసుకునేటప్పుడు స్ట్రా తో తాగడం మంచిది వలన దంతాల మీద ఎనామిల్ పొర ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది దంతాలు పసుపు రంగులోకి మారిపోకుండా ఉండాలంటే రోజు బ్రష్ చేసుకోవాలి.

Advertisement

రోజుకి రెండు సార్లు బ్రష్ చేసే అలవాటు ఉంటే చాలా మంచిది దీని వలన దంతాల మీద మరకలు తొలగిపోతాయి. దంతాలు తెల్లగా మారిపోతాయి. టూత్ పేస్ట్ ఎంచుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి దంతాల మీద మరకలని పసుపు రంగుని తొలగించే కెమికల్స్ ఉపయోగించిన టూత్ పేస్ట్ ని వాడితే మంచిది దంతాల మీద మరకలు ఏర్పడ్డాక వాటిని రెగ్యులర్ గా డెంటల్ చెక్ అప్ చేయించుకుని తొలగించుకోవడం మంచిది దంతాలను శుభ్రం చేయడానికి ఆయిల్ పుల్లింగ్ మెథడ్ కూడా మంచిది. నోటిలోని చెడు బ్యాక్టీరియాని తొలగిస్తుంది. పళ్ళు కూడా తెల్లగా మెరుస్తాయి. దంతాలు పసుపు రంగులో నుండి తెల్లగా మార్చడానికి స్ట్రాబెర్రీ ఆపిల్స్ తులసి నిమ్మరసం వేపాకులు నారింజ కూడా తీసుకోవచ్చు.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading