Home » ప్రతి భర్త తన భార్య కోసం ఈ 10 పనులు కచ్చితంగా చెయ్యాలి.. అవేంటో ఓ లుక్ వేయండి!

ప్రతి భర్త తన భార్య కోసం ఈ 10 పనులు కచ్చితంగా చెయ్యాలి.. అవేంటో ఓ లుక్ వేయండి!

by Srilakshmi Bharathi
Ad

ప్రేమలో పడటం సులభం. ఆ ప్రేమని నిలబెట్టుకోవడమే చాలా కష్టమైన పని. మన పెళ్లి రోజున మనం చేసే ప్రమాణాలను అనుసరించడానికి మన వైపు నుంచి కొన్ని ప్రయత్నాలు చెయ్యాల్సి ఉంటుంది. మనం పెళ్లికి ఎంత బాగా సిద్ధమైనప్పటికీ, మనం ఆ ప్రమాణాలను పాటించడం మొదలు పెట్టినప్పుడే మనం నిజంగా పెళ్ళికి సిద్ధం అయినట్లు అర్ధం. ప్రతి భర్త తన భార్య కోసం ఏమేమి పనులు చేయాలో ఇప్పుడే తెలుసుకోండి.

Advertisement

1. స్పర్శ:
మీ భార్యని కచ్చితంగా స్పృశిస్తూ ఉండండి. పడక గదిలో మాత్రమే కాదు.. మిగతా సమయాల్లో కూడా ఆమె మీకు ముఖ్యం అన్న విషయాన్ని మీ స్పర్శ ద్వారా తెలియచేయండి.

2. రెస్పెక్ట్ ఇవ్వండి:
ఆమె మీకు భార్య కాకమునుపు కచ్చితంగా మీరు ఆమె అభిప్రాయాలను అడిగే ఉంటారు. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆమె ఏమి తింటారు? ఏమి సినిమాలు చూస్తారు లాంటివి అడిగే నిర్ణయం తీసుకుంటారు. ఇదే రెస్పెక్ట్ ని మీ పెళ్లి అయ్యాక కూడా కొనసాగించాలి. పెళ్లి అయ్యిన తరువాత ఆమె అభిప్రాయాలను పక్కన పడేయకండి.

 

3. ఆమె భారాన్ని మోయండి
ఏ కారణాలతో పెళ్లి చేసుకున్నా, మీ జీవిత భాగస్వామిని ఒంటరిగా వదిలివేయకండి. ఆమె బాధ్యతల బరువులో కొంత మీరు కూడా పంచుకోండి.

4. లవ్ లాంగ్వేజ్ నేర్చుకోండి
స్త్రీలు మరియు పురుషులు విభిన్నంగా ప్రేమను చూపించడం చేస్తుంటారు. ప్రేమను చూపించే విధానంలో స్త్రీలది ప్రత్యేకమైనది. వారు సున్నితంగా తమ భావాలని తెలియచేస్తారు. వారు చెప్పేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కూడా వారి ప్రేమ భాషనీ నేర్చుకోండి.

Advertisement

5. ఆమెని తనలానే ఉండనివ్వండి:
మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక, ఆమె తన వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను కోల్పోయేలా చెయ్యకండి. ఆమె స్వభావాన్ని ఆమెకే ఉంచుకునే స్వేచ్చని ఇవ్వండి.

6. ఆమెకు స్పేస్ ఇవ్వండి
పెళ్లి జరిగాక సహజంగానే భార్యాభర్తలు ఎక్కువ సమయం కలిసే ఉంటారు. అయితే.. ఆమెకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించండి.

7. ఆమెను బెటర్ గా ట్రీట్ చేయండి:
ఒకసారి మీరు గమనించుకోండి. ఒక అపరిచిత వ్యక్తితో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఇంటికి రాగానే మీ భార్యపై ఎలా అజమాయిషీ చేస్తున్నారో ఆలోచించుకోండి. ఆమె పట్ల మీ ప్రవర్తన మీకు కూడా నచ్చకపోతే మార్చుకోవడానికి ట్రై చేయండి.

8. మీ ఎఫర్ట్ ని పెంచండి:
మీ బంధాన్ని నిలుపుకోవడానికి, ఆమెకు మీపై నమ్మకం కలిగేలా ఉండడానికి మీ ఎఫర్ట్ ని మరికొంచం పెంచండి. మీరు ఎంచుకున్న దారిలోకి మీ భాగస్వామి కూడా వస్తారు.

9. ఆమెని అడగండి:
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ఏమైనా చేయాలనీ అనుకునే ముందు ఒకసారి మీ భార్యని అడగండి. ఆమె అభిప్రాయాలను అడిగి తెలుసుకోండి.

10. ఆమె వెన్నంటి ఉండండి:
ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆమెకు మీరు ఉంటారన్న ధైర్యాన్ని ఇవ్వండి. ఆమెకి ఏమి కావాలి అని అడగడం మాత్రమే కాదు. ఆమెకు ఏమి అవసరం అవుతుంది అన్న ఆలోచన కూడా మీలో ఉండాలి.

Visitors Are Also Reading