Home » ఈ ఆహారపదార్థాలను కలిపి అస్సలు తీసుకోకండి.. లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం..!

ఈ ఆహారపదార్థాలను కలిపి అస్సలు తీసుకోకండి.. లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం..!

by Anji
Ad

మనం తినే కొన్ని ఆహార పదార్థాలు మన ప్రాణం మీదికి తీసుకొచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. కొంతమంది వారు తినే ఆహారంలో ఏవైనా రెండు పదార్థాలను కలిపి తింటే రుచిగా ఉంటుందని లాగించేస్తారు. కానీ వాటి వల్ల ఎంత ప్రమాదమనేది మాత్రం అస్సలు పసిగట్టరు. కొన్ని కాంబినేషన్ లు నెమ్మదిగా పాయిజన్ గా మారి మన  ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆలోచించకుండా వేటిని పడితే వాటిని కలిపి తీసుకుంటే కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు. ఈఏ రెండు ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Manam News

Advertisement

సాధారణంగా తేనె, నెయ్యి విడి విడిగా చూస్తే రెండు  కూడా ఆరోగ్యానికి చాలా మంచి వస్తువులు. వీటితో ఎన్నో లాభాలు ఉంటాయి. ఇవి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలు. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఈ రెండింటి మోతాదును సమానంగా ఒకేసారి అస్సలు తీసుకోకూడదు. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల స్లో పాయిజన్ గా మారే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో ఈ రెండింటిని కలపాలంటే రెండు సమానమవుతాదులో వేయరు ఒకటి ఎక్కువగా.. మరొకటి తక్కువగా వేస్తుంటారు. 

Manam News

అదేవిధంగా పాలు, అరటిపండు కలిపి తీసుకోవడం వల్ల చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పాలలో ఉన్నటువంటి కొవ్వు అరటిపండ్లలో ఉండే చక్కెర వల్ల జరిగే చర్యలు అప్పటికప్పటికీ సమస్య చూపించక పోయినా.. భవిష్యత్తులో చెవి సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పెరుగన్నంలో అరటిపండు కలిపి తీసుకుంటే జీర్ణాశయం పులుసు పోయి చర్మ సంబంధిత వ్యాధులు సంభవిస్తాం. అదేవిధంగా గ్యాస్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది.  

Advertisement

Also Read :  రోజ్ వాటర్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. వీటిని ఎలా వినియోగించుకోవాలంటే..?

Manam News

కొందరూ కొన్ని కూరలలో పాలు పోసి వండటం అలవాటు. పాలకు ఉప్పు తగలడం వల్ల పాలు విరిగిపోయి దానిని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తానికి అందాల్సిన ఆక్సిజన్ అందదు. కాబట్టి దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. భవిష్యత్ లో కొన్ని రకాల వ్యాధులు సోకే ప్రమాదముంది. ఆకుకూరలలో అస్సలు పాలు పోసి వండకూడదు. 

Also Read :  ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి.. జాగ్రత్త..!

Manam News

చాలా మంది సలాడ్స్ లలో టమోటా కీరదోస కలిపి తింటుంటారు. ఈ రెండు కలిపి అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ రెండింటికీ రెండు విభిన్నమైన గుణాలుంటాయి. వీటివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినే అవకాశముంది. కొంత మంది భోజనం చేసిన వెంటనే సలాడ్స్ తీసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేయడం ద్వారా కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. భోజనం చేసిన రెండు గంటల తరువాత సలాడ్స్ తినాలి. సలాడ్స్ లో క్యారెట్ వేస్తే నిమ్మకాయ ఉపయోగించకూడదు. క్యారెట్, నిమ్మకాయ రెండు గుండెలలో మంట వస్తుంది. అదేవిధంగా మూత్ర సంబంధిత వ్యాధులు కూడా సంభవిస్తాయి. సలాడ్స్ లో ముల్లంగి ఉంటే దానిని తిన్న తరువాత పాలు, తేనే, అరటికాయ అస్సలు తినకూడదు. ముఖ్యంగా గుడ్లు, పొట్లకాయ కలిపి వండుకొని తినడం ద్వారా శరీరంలో విషపదార్థాలు చేరుతాయి. ఈ విషయాన్ని పూర్వ కాలం నుంచి పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఈ కాంబినేషన్లు తినకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

Also Read : ఈ అబ్బాయికి శరీరం మొత్తం వెంట్రుకలే.. వైద్యులు ఏమంటున్నారంటే ?

Visitors Are Also Reading