భారతీయులు ఎక్కువగా బంగారం, వెండి నగలని కొనుగోలు చేసి ధరిస్తూ ఉంటారు. బంగారం అయితే మన రేంజ్ ని చూపించుకోవడానికి కూడా చాలామంది బంగారు నగల్ని వేసుకుంటూ ఉంటారు. బంగారం, వెండి నగలు చాలా ఖరీదైనవి అయి ఉంటాయి. వీటిని మనం జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అయితే బంగారు నగల్ని, వెండి నగల్ని ఎప్పుడూ కూడా కలిపి పెట్టకూడదు అనే విషయం చాలా మందికి తెలియదు. ఎప్పుడూ కూడా ఈ రెండిటిని కలపకూడదు. ఇలా చేస్తే రెండు పాడవుతాయి. ఈ లోహాల ఉపరితలం మెరుపు కాలక్రమమైన తగ్గిపోతుంది. వెండి కూడా ఒక రియాక్టివ్ మెటల్. ఏదైనా ఇతర లోహంతో కలిస్తే దానిలో చర్య మొదలవుతుంది. బంగారం నాన్ రియాక్టివ్ మెటల్.
Advertisement
Advertisement
దాని చుట్టూ ఉన్న లోహంతో ఏ విధంగానూ స్పందించదు. కానీ కొన్నిసార్లు దానిమీద మెరుపు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ఖరీదు పెట్టి మనం బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తాం కాబట్టి భద్రపరిచేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు. బంగారం వెండి ఆభరణాలని కాసేపు ఒకే చోట పెట్టేస్తే ఇబ్బంది ఉండదు. రెండిటిని ఎక్కువ సేపు ఉంచినట్లయితే వెండి స్పందించడం మొదలవుతుంది. రసాయనిక చర్యలు స్టార్ట్ అవుతాయి. తక్కువ సేపు పక్కపక్కన పెడితే సమస్యేమీ ఉండదు.
ఒకవేళ వున్నా చాలా చిన్నగా ఉంటుంది. కానీ అలా వదిలేస్తే క్రమంగా ఫేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వెండి ఆభరణాల మీద కొద్దిగా పోర కనపడటం గమనించవచ్చు. ఎప్పుడూ కూడా మెటల్ అభరణాలని వేరువేరుగా భద్రపరుచుకోవాలి. రెండు మెటల్ ఆభరణాలని ఒకే దగ్గర అసలు పెట్టకండి ఈ చిన్న విషయాన్ని మాత్రం మర్చిపోయారు అంటే అనవసరంగా ఆభరణాలు పాడైపోతాయి పైగా అందులో మనం ఎక్కువ డబ్బులు పెట్టి వాటిని కొంటాం కాబట్టి అశ్రద్ధ అస్సలు చేయకండి.