Home » మీ జుట్టు పెర‌గ‌డం లేదా..? అయితే ఈ చిట్కాను ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి..!

మీ జుట్టు పెర‌గ‌డం లేదా..? అయితే ఈ చిట్కాను ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి..!

by Anji
Ad

చాలా మంది మ‌హిళ‌ల‌కు జుట్టు రాల‌డం స‌మ‌స్య ఉంటుంది. జుట్టు రాల‌డం త‌గ్గి కొత్త జ‌ట్టు రావ‌డం కోసం ర‌క‌ర‌కాల షాంపులను ఆయిల్స్ ఉప‌యోగిస్తుంటారు. కెమిక‌ల్స్ క‌లిపిన షాంపులు, నూనెలు, హెయిర్ స్క్రేలు, డైలు వంటివి వాడ‌డం వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి త‌ప్ప ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఇక ఈ చిట్కాను ప్ర‌య‌త్నించ‌డం ద్వారా జ‌ట్టు రాల‌డం త‌గ్గి కొత్త జుట్టు వ‌స్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు చాలా ట్రై చేసి విసిగిపోయామ‌నుకున్న వారు ఇది ఒక‌సారి ప్ర‌య‌త్నించి చూడండి. రిజ‌ల్ట్స్ చూసి మీరే ఆశ్చ‌ర్య‌పోతారు. ఇది మీ ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు.

ఇది త‌యారు చేయ‌డానికి కావాల్సిన ప‌దార్థాలు క‌ల‌బంద‌, కాఫీ పౌడ‌ర్‌, టీ పొడి. దీని కోసం ముందుగా మీ జుట్టుకు స‌రిప‌డేంత క‌ల‌బంద తీసుకొని శుభ్రంగా క‌డుక్కోవాలి. ఆ త‌రువాత క‌ల‌బంద అంచుల‌ను క‌ట్ చేసి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. క‌ట్ చేసి ముక్క‌ల‌ను మిక్సీజార్‌లో వేసుకోవాలి. దీనిలో ఏ బ్రాండ్ అయినా ఓ చెంచా కాఫీ పొడిని వేసుకోవాలి. కాఫీపొడి క‌ల‌బంద జుట్టు సిల్కీగా త‌యార‌వ్వ‌డానికి సాయ‌ప‌డ‌తాయి. అదేవిధంగా జుట్టు మృదువుగా శైనీగా అవ్వ‌డంలో కూడా ఇవి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. త‌రువాత దీనిలో ఒక చెంచా టీ పొడి కూడా వేసుకోవాలి. టీ పొడి జుట్టు రాల‌డం త‌గ్గించి జుట్టు రాలిన చోట కొత్త వెంట్రుక‌లు రావ‌డానికి సాయ ప‌డుతుంది. త‌రువాత దానిలో ఓ చెంచా నీళ్లు వేసుకుని మిక్సీ ప‌ట్టుకోవాలి.

Advertisement

Advertisement


ఇక ఈ మిశ్ర‌మాన్ని ఓ బౌల్‌లోకి తీసుకొని కాట‌న్ లేదా జుట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన త‌రువాత ఒక అర‌గంట సేపు అలా ఉండ‌నివ్వాలి. త‌రువాత ఏదైనా మైల్డ్ షాపుంతో త‌ల‌స్నానం చేయాలి. ఈ వారానికి మూడుసార్లు రాయ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పొడ‌వుగా పెరుగుతుంది. అంతేకాదు.. చుండ్రు, దుర‌ద వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ప‌ట్టులా, మృదువుగా కూడా త‌యారు అవుతుంది. వీటిలో ఎలాంటి హానీ క‌లిగించే ప‌దార్థాలు లేవు. కాబ‌ట్టి జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఒత్తుగా, న‌ల్ల‌గా పొడ‌వుగా బలంగా త‌యార‌వుతుంది.

Also Read : 

‘అఖండ’ అరుదైన రికార్డు.. దేశంలోనే ఈ ఫీట్ అందుకున్న హీరో బాల‌య్య‌..!

ఈ అల్లం పేస్టుతో జాగ్రత్త.. తిన్నారంటే పేగులు ఖతం..?

Visitors Are Also Reading