ఫోన్ వాడటంలో తప్పు లేదు గాని ఫోన్ అతిగా వాడటం నిజంగా పాపం లేదా శాపం అనే చెప్పాలి. పక్కన వాడు మనతో గొంతు పోయేలా మాట్లాడుతుంటే మనం వెకిలి నవ్వులు నవ్వుకుంటూ ఫోన్ చూడటం పాపమే. ఎంత మంది ఇంట్లో ఉన్నా నవ్వు ఏడుపు లేకుండా ఫోన్ పట్టుకుని కూర్చోవడం శాపం. అసలు ఫోన్ వాడే విషయంలో ఏం ఏం చేయాలి…? ఎలా ఉంటే మంచిది అనేది మనం న్యూస్ మీకు కొన్ని సలహాలు ఇస్తుంది.
Advertisement
పొద్దున లేవగానే ఫోన్ పట్టుకోకండి, బెడ్ షీట్ మడత పెట్టి పట్టుకోవడం కాస్త బెటర్. ఎందుకంటే బెడ్ షీట్ ఎప్పుడైతే మడత పెడతామో సగం బద్ధకం వదులుతుంది. మంచం మీద పడి గంటలు గంటలు దొర్లకుండా ఉంటాం. బాత్రూమ్ లోకి మొబైల్ అస్సలు తీసుకు వెళ్ళకుండా ఉండటం మంచిది. ఆ వాసనలో కూర్చుని నొక్కితే రకరకాల రోగాలు. బ్రేక్ఫాస్ట్ టైం లో అయిన ఫోన్ కి కొంచెం బ్రేక్ ఇస్తే మంచి ఫుడ్ తింటాం. రోజు కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. ఆఫీస్ కు వెళ్ళే వారికి టైం సేవ్ అవుతుంది.
Advertisement
ఇతరుల రిప్లైస్ కోసం వేయిట్ చేస్తూ టైం వేస్ట్ చేయడం దరిద్రమైన పని. అలా వెయిట్ చేస్తే మిన్ను విరిగి మీద పడినా ఆ రిప్లై కోసమే చూస్తాం. బస్ లో లేదా పబ్లిక్ లో సోషల్ మీడియా వాడుతూ సోషల్ డిస్టెన్స్ ని మర్చిపోవడం జరుగుతుంది. ఫోన్ మాట్లాడే టైం లో అటు మాట్లాడే వారికీ టైం ఇవ్వడం మంచిది. మీరు చెప్పేది వాళ్లకు బోర్ కొట్టకుండా ఉంటుంది. OTP లతో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. పడుకునేటప్పుడు ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవడం చాలా మంచిది.