మనం కచ్చితంగా ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా పండ్లు తినేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు. సాధారణంగా మనం పండ్లు తినాలని అనుకుంటే నచ్చినవి తీసుకుని తినేస్తూ ఉంటాము. కానీ కొన్ని కాంబినేషన్స్ లో పళ్ళు తినడం మంచిది కాదు. పండ్లు తినేటప్పుడు ఇలా చెయ్యద్దు. లేకపోతే డేంజర్ లో పడతారు. చాలామంది రకరకాల పండ్లను తీసుకొని కట్ చేసి, సలాడ్ లాగా తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని రకాల పండ్లను కలిపి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి.
Advertisement
Advertisement
ఏ పండ్లు కలిపి తినకూడదు అనే విషయాన్ని చూద్దాము. క్యారెట్, నారింజపండు కలిపి తినడం మంచిది కాదు. ఈ రెండిటిని ఒకేసారి తీసుకుంటే గుండెలో మంట, మూత్రపిండాల్లో సమస్యలు వస్తాయి అని ఆరోగ్యనిపుణులు చెప్పడం జరిగింది. బొప్పాయి, నిమ్మ కలిపి తీసుకుంటే రక్తహీనత సమస్య కలుగుతుంది. పాలు నారింజ రెండిటిని కూడా కలిపి తీసుకోవద్దు. ఈ రెండు కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. అరటిపండు జామపండు కూడా కలిపి తీసుకోవద్దు. గ్యాస్ సమస్య వస్తుంది. అలానే పండ్లను కూరగాయలను ఎప్పుడూ కలపకండి. జీర్ణవ్యవస్థకి కష్టమవుతుంది. పైనాపిల్ పాలు కలిపి తీసుకోవద్దు గ్యాస్ వికారం ఇన్ఫెక్షన్స్ తలనొప్పి వంటివి కలుగుతూ ఉంటాయి.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!