ప్రతి ఒక్కరు కూడా అందమైన కురులని పొందాలని అనుకుంటుంటారు. తలకి చుండ్రు వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తలకి నూనె రాసుకోవడం తలస్నానం చేయడం చేస్తారు. కొంతమంది అయితే జుట్టు మృదువుగా ఉండడానికి కొన్ని ఇంటి చిట్కాలని కూడా పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగా ఉండాలన్నా నూనె పెట్టడం కూడా అవసరం. రాత్రి జుట్టుకి నూనె రాసుకోవడం మంచిదని చాలామంది అనుకుంటూ ఉంటారు. రాత్రిపూట జుట్టుకు నూనె రాసుకుంటే వెంట్రుకలు యొక్క కుదుళ్ళు అడ్డుపడతాయి.
Advertisement
Advertisement
హెయిర్ ఆయిల్ ఎక్కువ ఉంచుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. నెత్తి మీద, కాను బొమ్మలు మీద, చెవులు వెనక, ముక్కు పై పసుపు మచ్చలు ఏర్పడతాయి. జుట్టుకి బాగా నూనె ఉంచుకోవడం వలన ముఖం పై పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. కాబట్టి రాత్రి పూట జుట్టుకి నూనె రాసుకోవడం మంచిది కాదు. షాంపూ చేయడానికి అరగంట ముందు నూనె రాసుకుంటే చాలు. కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్, నువ్వుల నూనె ఇవన్నీ కూడా జుట్టుకి బలాన్ని ఇస్తాయి. జుట్టుని అందంగా మార్చగలవు కాబట్టి ఈ ఆయిల్స్ ని మీరు వాడొచ్చు. కొబ్బరి నూనె ని జుట్టు సంరక్షణలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. సంతృప్త కొవ్వు, ఆమ్లాలు, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా కొబ్బరి నూనెలో ఉంటాయి అలానే ఇతర నూనెలలో కూడా మంచి పోషకాలు ఉంటాయి. మంచి ప్రయోజనాలు ఉన్నాయి.
Also read:
- కలలో కప్పలు కనపడితే.. అర్ధం ఏమిటో మీకు తెలుసా..?
- రక్తంలో యూరిక్ ఆసిడ్ ని కంట్రోల్ చెయ్యాలా..? అయితే ఇలా చేయండి..!
- రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే.. వీటిని తప్పక తీసుకోండి..!