Telugu News » Blog » అక్కినేని ఫ్యామిలీని వెంటాడుతున్న విడాకులు.. ఆ శాప‌మే కార‌ణ‌మా..?

అక్కినేని ఫ్యామిలీని వెంటాడుతున్న విడాకులు.. ఆ శాప‌మే కార‌ణ‌మా..?

by Anji
Ads

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న విష‌యం తెలిసిందే. ఇక అక్కినేని హీరోల‌కు అభిమానులు కోట్లాది సంఖ్య‌లో ఉన్నారు. అస‌లు అక్కినేని కుటుంబానికి చెందిన వ్య‌క్తుల‌కే ఎందుకు ఇలా జ‌రుగుతుందోన‌ని ప‌లువురు నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ముఖ్యంగా స‌మంత చైత‌న్య దంప‌తులు విడాకులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Ads

అక్కినేని కుటుంబానికి చెందిన వ్య‌క్తుల లైఫ్ పార్ట‌న‌ర్‌కి సంబంధించి చాలా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏఎన్నార్ కుటుంబానికి చెందిన వాళ్ల‌లో ఎంతో మంది ఇండ‌స్ట్రీలో ఉన్నారు. స్టార్ హీరో నాగార్జున తొలుత వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మీని పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని కార‌ణాల వ‌ల్ల నాగార్జున‌, ల‌క్ష్మీ విడాకులు తీసుకున్నారు. ఆ త‌రువాత నాగార్జున అమ‌ల‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి త‌రువాత నాగార్జున‌, అమ‌ల అన్యోన్యంగా ఉన్నారు. హీరో సుమంత్ హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్న విష‌యం విధిత‌మే.

ఇది కూడా చ‌ద‌వండి : అల్లు అర్జున్ మొదటి సినిమా “గంగోత్రి” హీరోయిన్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? అస్సలు గుర్తు పట్టలేరు గా !

Ads


కీర్తిరెడ్డి, సుమంత్ మ‌ధ్య‌లో కూడా మ‌న‌స్పార్థాలు చోటుచేసుకున్నాయి. అక్కినేని ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన సుప్రియ హీరో చ‌ర‌ణ్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చ‌ర‌ణ్ రెడ్డి అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల మ‌ర‌ణించ‌గా.. వీళ్లీద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్పార్థాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. హీరో అఖిల్ కు శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం జ‌ర‌గ్గా.. కొన్ని కార‌ణాల‌తో పెళ్లి ఆగిపోయింది. తాజాగా నాగ‌చైత‌న్య స‌మంత కూడా విడాకులు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇక అక్కినేని కుటుంబానికి ఏదో శాపం త‌గిలింద‌ని.. ఆ శాపం వ‌ల్ల‌నే ఈ విధంగా జ‌రుగుతుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏమైనా దోషాలుంటే ప‌రిహారాలు చేయించాల‌ని లేదంటే శాపాలు భవిష్య‌త్ త‌రాల‌ను కూడా వెంటాడుతాయ‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన వ్య‌క్తుల జీవితంలో ఇలా జ‌ర‌గ‌డంతో అభిమానులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Ad

ఇది కూడా చ‌ద‌వండి :  పోకిరి రికార్డ్స్ బ్రేక్ చేసిన జల్సా..!