Home » రోహిత్, హార్దిక్ మధ్య గొడవలు ఎందుకు..? కారణం ఏమిటి…?

రోహిత్, హార్దిక్ మధ్య గొడవలు ఎందుకు..? కారణం ఏమిటి…?

by Sravya
Ad

ముంబై ఇండియన్స్ తమ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్య ని ప్రకటించారు అప్పటినుండి ముంబై జట్టులో గొడవ మొదలైంది. సూర్య కుమార్ యాదవ్, బుమ్రా వంటి ఆటగాళ్లు ఈ నిర్ణయం పట్ల సంతృప్తిగా లేరు అని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్షలు మంది అభిమానులు సోషల్ మీడియాలో ముంబైని అన్ ఫాలో చేశారు కూడా కొన్ని ప్రాంతాల్లో ముంబై జట్టు జెర్సీని జెండాలని తగలబెట్టేసారు. ముంబై ఇండియన్స్ ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్నకి సమాధానం అయితే దొరకట్లేదు.

Advertisement

సరిగ్గా ఇలాంటి సమయంలోనే రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా మధ్య గ్యాప్ కూడా వచ్చింది వీళ్లిద్దరూ గొడవ పడ్డారా అసలు ఇదంతా హార్దిక ప్లాన్ ప్రకారం చేశాడా అంటూ వార్తలు అయితే వచ్చాయి. ఏడాది క్రితం ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్య ని వదిలేసింది. ఇదంతా కూడా రోహిత్ కి తెలియకుండా జరిగిందా..? రోహిత్ చెప్పడం వలన హార్దిక్ పాండ్యా పట్ల ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అని తెలిసింది. ముంబై నుండి బయటకు వెళ్లిన తర్వాత పాండ్యా గుజరాత్ కెప్టెన్ అయ్యాడు.

Advertisement

కప్ కొట్టి తను ఎంత విలువైన ఆటగాడో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ టైంలో రోహిత్ టీ20 లకి దూరం అయ్యాడు. ఏజ్ పెద్ద ఫ్యాక్టర్ అయిపోయింది. ముంబై ఇండియన్స్ కన్ను మళ్లీ పాండ్యా మీద పడింది. పోటీ ఫార్మేట్ కి దూరంగా ఉండే రోహిత్ ని ఇంకో సీజన్ కెప్టెన్ గా ఉంచుకుని పాండ్యా ని కెప్టెన్ గా చేశారు. ఈ సీజన్ నుండి తనని కెప్టెన్ గా పెడితే తాను టీం మారడానికి సిద్ధమని లేకపోతే, గుజరాత్ లోని కొనసాగుతా అని హార్దిక్ చెప్పేసాడు. పాత గొడవలు మనసులో పెట్టుకుని హార్దిక్ ఇలా వ్యవహరిస్తున్నాడని ఫ్యాన్స్ వాదిస్తున్నారు టీమిండియా టి20 కెప్టెన్సీ బాధ్యతలు కూడా త్వరలోనే పాండ్య చేతులకి రావడం కచ్చితంగా వస్తున్నాయి.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading