Home » అల్లు అర్జున్ నా ఫెవరెట్ అంటున్న బాలీవుడ్ భామ..!

అల్లు అర్జున్ నా ఫెవరెట్ అంటున్న బాలీవుడ్ భామ..!

by Azhar
Ad

అల్లు అర్జున్ కు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం అందరికి తెలుసు. కానీ గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా అనేది ఆ క్రేజ్ ను విపరీతంగా పెంచింది. ఈ సినిమా ముందువరకు తెలుగులో మాత్రమే తెలిసిన అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో మొత్తం దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ అనేది సంపాదించుకున్నాడు. మరి ముఖ్యంగా సెలబ్రెటీలలో కూడా చాల మంది అల్లు అర్జున్ కు అలాగే పుష్పలో అతని మేనరిజంకు అభిమానులుగా మారిపోయారు. క్రికెట్ లో అయితే ఈ పుష్ప స్టైల్ అనేది ఓ ట్రెండ్ సెట్ చేసింది.

Advertisement

అయితే ఇలా ఇప్పుడు ఓ బాలీవుడ్ భామ కూడా తాను అల్లు అర్జున్ కు పెద్ద ఫ్యాన్ అని చెబుతుంది. ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నవారిలో దిశా పటాని కూడా ఉంటుంది. లోఫర్ సినిమాతో టాలీవుడ్ అభిమానులకు ముందునుండే పరిచయ ఉన్న ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి.. ఇక మొత్తం అక్కడే సెటిల్ అనేది అయ్యింది. హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం దిశా పటాని ఏక్ విలన్ 2 అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇక ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ అనేది పూర్తి చేసుకుంది. అందువల్ల దీని ప్రమోషన్స్ లో బిజీ అయ్యిపోయింది దిశా పటాని. అందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫెవరెట్ హీరో గురించి మాట్లాడింది. మీ ఫెవరెట్ హీరో ఎవరు అనగానే.. ఒక్క క్షణం ఆలోచించకుండా.. అల్లు అర్జున్ అని చెప్పేసింది. తన యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్పిన దిశా పటాని.. అల్లు అర్జున్ తో కలిసి నటించే అవకాశం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను అని ప్రకటించింది. చూడాలి మరి ఈ అమ్మడి కోరిక ఎప్పటికి తీరుతుంది అనేది.

ఇవి కూడా చదవండి :

యూఏఈకి ఆసియా కప్… చెప్పేసిన దాదా…!

ఇండియాకు షాక్.. డోప్ టెస్టులో దొరికిపోయిన మహిళా అథ్లెట్లు..!

Visitors Are Also Reading