Home » కమెడీయన్ సుమన్ శెట్టి గురించి దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు..!

కమెడీయన్ సుమన్ శెట్టి గురించి దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీకి నూతన నటీనటులను ఎక్కువగా పరిచయం చేసిన దర్శకుడు తేజ అనే చెప్పాలి. చిత్రం సినిమాతో తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకొని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు తేజ. ఇండస్ట్రీలో ఇలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు తేజ ఎంతోమంది టెక్నీషియన్లను నిర్మాతలను, హీరో, హీరోయిన్లను పరిచయం చేశారు. తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారిలో ప్రస్తుతము చాలామంది స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ కు యాంకర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు వారందరూ గొప్ప స్థానంలో ఉన్నారు. అలా గొప్ప స్థానంలో ఉన్నవారు మీకోసమే ఏదైనా చేశారా అని ప్రశ్నించారు యాంకర్.

Advertisement

ఈ ప్రశ్నకు దర్శకుడు తేజ ఒక చిరునవ్వు నవ్వా రు. వారు గొప్ప స్థానంలో ఉంటే నాకోసం ఎందుకు చేయాలని ఎదురు ప్రశ్నించడమే కాకుండా ఓ వ్యక్తి ఉన్నారంటూ సమాధానం చెప్పారు. కమెడియన్ సునీల్ శెట్టి గురించి మాట్లాడుతూ.. తనను జయం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. ఒకరోజు ఆయన తన వద్దకు వచ్చి మీరు సినిమాలో అవకాశం కల్పించడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని తన కాళ్ళ మీద పడ్డట్టు తేజ చెప్పారు. మీరు ఇచ్చిన అవకాశం వల్లే నేను ఈ స్థాయిలో ఉండి సొంతంగా ఇల్లు కట్టుకున్నానని చెప్పుకొచ్చా రు.

Advertisement

Also Read :   కొడుకులు, కూతుళ్లు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్.. దీని వెనుక ఇంత కథ ఉందా ?

ఈ క్రమంలోనే తేజ తనను లేపీ మీలాంటి కొత్త వారందరినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏదో ఒక రోజు నేను రోడ్డు మీదకు వస్తాను. ఆరోజు రోడ్డుపై ఉండకుండా నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తాను మీ ఇంట్లో నాకోసం ఒక గది కట్టించి పెట్టా అంటూ సమాధానం చెప్పాను. దీంతో సునీల్ శెట్టి ఇంట్లో తనకంటూ ప్రత్యేకంగా గది నిర్మించడమే కాకుండా ఆ గదిని తరచూ శుభ్రం చేస్తూ.. ఆ గదిలో తన ఫోటోను కూడా పెట్టారని తేజ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read :  మీరు పంచతంత్రం ట్రైలర్ చూశారా..? ఎలా ఉందంటే ?

Visitors Are Also Reading