Telugu News » Blog » ఆ స్టార్ డైరెక్ట‌ర్ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడా..?

ఆ స్టార్ డైరెక్ట‌ర్ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడా..?

by Anji
Ads

టాప్ ద‌ర్శ‌కుడు అయిన‌టువంటి శంక‌ర్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సినిమా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసినదే. రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో ఈ సినిమా 15 మూవీ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒక‌రైన‌ దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగానే కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. అదేవిధంగా ఈ సినిమాతో పాటు క‌మ‌ల్‌హాస‌న్‌తో భార‌తీయుడు 2 సినిమా చేస్తున్నారు ద‌ర్శ‌కుడు శంక‌ర్‌. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ‌మైన త‌రువాత అనుకోని కార‌ణాల మూలంగా సినిమా ఆగిపోయింది. త్వ‌ర‌లో ఈ చిత్రం షూటింగ్ కూడా తిరిగి ప్రారంభమ‌య్యే అవ‌కాశ‌ముంది.

Indian 2' director Shankar was interrogated for more than 2 hours by CBI |  Tamil Movie News - Times of India

అదేవిధంగా బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్‌సింగ్‌తో సినిమా చేస్తున్నారు శంక‌ర్‌. త‌మిళం, తెలుగు భాష‌ల్లో విడ‌ద‌లై సూప‌ర్ హిట్ అయిన‌టువంటి అప‌రిచితుడు సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉండ‌గా.. శంక‌ర్ త‌న‌యుడు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు అని తెలుస్తోంది. అర్జిత్ శంక‌ర్ త‌మిళంలో హీరోగా ఆరంగేట్రం చేయ‌గా.. శంక‌ర్ అసోసియేట్ బాలీజీ శ‌క్తివేల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించుకున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అర్జిత్ ఇప్ప‌టికే న‌ట‌న‌-ఫిల్మ్ మేకింగ్ లో శిక్ష‌ణ పొందాడు. అందుకోసం ఆయ‌న కాద‌ల్ సీక్వెల్ ను ఎంచుకోవ‌డం విశేషం.

S. Shankar - Wikipedia
కాద‌ల్ సినిమా తెలుగులో ప్రేమిస్తేగా వ‌చ్చిన‌ది. ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ విజ‌యాన్ని ద‌క్కించుకున్న‌ది అప్ప‌ట్లో. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌తో ఆర్జిత్ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు అని స‌మాచారం. శంకర్ కూతురు అదితి కూడా హీరోయిన్ గా రెండు సినిమాలు చేస్తున్న సంగ‌తీ తెలిసిన‌దే.


You may also like