Home » అఖిల్ తోనే సినిమా చేయాలంటున్న తమిళ్ డైరెక్టర్..!

అఖిల్ తోనే సినిమా చేయాలంటున్న తమిళ్ డైరెక్టర్..!

by Azhar
Ad
అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన అఖిల్… టాలీవుడ్ ఎంట్రీ అనేది 10 ఏళ్ళు పూర్తి కావస్తుంది. అయిన కూడా ఇప్పటివరకు అఖిల్ కు ఒక్క హిట్ కూడా లేదు. చివరగా అఖిల్ నుండి వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ అయితే అందుకోలేదు. అయితే ఇప్పుడు అఖిల్ ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దీనికి దర్శకుడు.
అందువల్ల ఈ సినిమా పైనే ఇప్పుడు అఖిల్ ఆశలు అనేవి అన్ని ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ఏ హిట్ డైరెక్టర్ తనతో సినిమా చేస్తాడు అని అఖిల్ అనుకుంటున్న సమయంలో..  నేను అఖిల్ తోనే సినిమా తీస్తాను ఓ తమిళ హిట్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు అని తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు..పి ఎస్ మిత్రన్.
ఈయన తీసే సినిమాలు అన్ని కొత్తగా ఉంటాయి. ఇప్పటివరకు పి ఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన అభిమన్యుడు, శక్తి అనే సినిమాలు హిట్ కాగా.. ఈ దీపావళికి కార్తీ హీరోగా వస్తున్న సర్ధార్ సినిమాను కూడా ఈయనే డైరెక్ట్ చేసాడు. అటువంటి హిస్ ఉన్న డైరెక్టర్.. తాను అఖిల్ తోనే ఓ సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యినట్లు.. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి అఖిల్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ అనేది ఇస్తాడా.. లేదా అనేది.

Advertisement

Visitors Are Also Reading