Home » ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత….ఆయన సూపర్ స్టార్ కృష్ణకు ఏమవుతారో తెలుసా..?

ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత….ఆయన సూపర్ స్టార్ కృష్ణకు ఏమవుతారో తెలుసా..?

by AJAY
Ad

ప్రముఖ దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి 86 ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు చెన్నై లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. పి.సి.రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పి.సి.రెడ్డి సుమారుగా 90 సినిమాలకు దర్శకత్వం వహించారు. అప్పటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి స్టార్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో పి.సి.రెడ్డి సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నారు.

Director Pc Reddy

Director Pc Reddy

అయితే మిగతా హీరోలతో పోలిస్తే సూపర్ స్టార్ కృష్ణ కు పీసీ రెడ్డి తో ప్రత్యేక అనుబంధం ఉంది. పీసీ రెడ్డి 1959 లో అసిస్టెంట్ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. అప్పట్లో అగ్రదర్షకుల వద్ద పనిచేశారు. ఆ తర్వాత “అనురాధ” అనే చిత్రానికి మొదటిసారిగా పి.సి.రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ నటించగా ఆయన సతీమణి విజయనిర్మల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత కృష్ణ పి.సి.రెడ్డి ల మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో పదుల సంఖ్యలో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.

Advertisement

Advertisement

Director Pc Reddy

Director Pc Reddy

అదేవిధంగా అప్పటివరకు క్లాస్ హీరోగా ఉన్న శోభన్ బాబుకు పి.సి.రెడ్డి సినిమాతో మాస్ హీరోగా గుర్తింపు వచ్చింది. పి.సి.రెడ్డి దర్శకత్వం వహించిన “మానవుడు దానవుడు” సినిమాతో శోభన్ బాబు మాస్ హీరో గా మారిపోయారు. అంతేకాకుండా ఎన్టీ రామారావు హీరోగా నటించిన బడిపంతులు సినిమాకు పి.సి.రెడ్డి దర్శకత్వం వహించారు. అప్పటివరకు ఎన్టీరామారావు అలాంటి సినిమాలోనే నటించలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించిన డం విశేషం. ఇక ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

Also read : నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading