Home » పెద్ద హీరోలు కాబట్టి ఫస్ట్ డే హౌస్ ఫుల్.. ఆ తరువాత !

పెద్ద హీరోలు కాబట్టి ఫస్ట్ డే హౌస్ ఫుల్.. ఆ తరువాత !

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ సినీ పరిశ్రమకు రెండు కళ్లలాంటి వారు. సంసారం, పల్లెటూరి పిల్ల, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, మాయాబజార్ వంటి పలు చిత్రాల్లో నటిస్తుండగా.. విజయ వారి సంస్థలో ఓ మల్టీస్టారర్ అవకాశం వచ్చింది.

Advertisement

జానపద బ్రహ్మాగా పేరు పొందిన విఠలాచార్య కన్నడంలో మణెతుంబిద హెన్ను రూపొంచారు. ఓసారి విజయ సంస్థ అధినేత బి.నాగిరెడ్డి సహకారాన్ని విఠలాచార్య పొందారు. ఆక్రమంలో బి.నాగిరెడ్డి అడగగానే ఆ కన్నడ సినిమా హక్కులను విఠాలాచార్య ఇచ్చారు. 

Also Read :  RRR చిత్ర యూనిట్ గురించి నిర్మాత డీవీవీ దానయ్య సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?

కన్నడ చిత్రంలో గుండమ్మ ఇతర పాత్రల్లో ఒకటిగా ఉంటుంది. గుండమ్మ అనే పేరు వాస్తవానికి తెలుగు ప్రాంతానిది కాదు. దర్శక, నిర్మాతలు తెలుగు కోసం టైటిల్ ని పెడదామనుకున్నారు. చక్రపాణి గుండమ్మ టైటిల్ బాగుందని చెప్పడంతో చివరికీ ఆ టైటిల్ నే అంగీకరించారు. కథ అయితే కన్నడం నుంచి తీసుకున్నారు. కానీ కథని బి.నాగిరెడ్డి ముందుగా దర్శకుడు పి.పుల్లయ్యకి చదివి వినిపించారు. కథ నచ్చలేదని పుల్లయ్య తిరస్కరించారు. నాగిరెడ్డి తన సోదరుడు బి.ఎన్.రెడ్డితో ఈ సినిమాను రూపొందించాలనుకున్నారు. ఆయన కళాత్మక చిత్రాలు తీయడంతో ఇలాంటి ఆయన తీస్తే బాగుండదనే ఉద్దేశంతో దర్శకుడిగా బి.ఎన్.రెడ్డిని తీసుకోలేదు. ఈ కథను సహ నిర్మాత, స్నేహితుడైన చక్రపాణికి అందజేశారు. ఆయన ఈ కథలో చాలా మార్పులు చేశారు. కన్నడంలో గుండమ్మ పాత్ర మామూలుగా ఉంటుంది. కానీ చక్రపాణి ఈ చిత్రంలో గుండమ్మ పాత్రనే ప్రదానంగా తీర్చిదిద్దారు. చివరికీ కమలాకర కామేశ్వరరావును దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. 

Advertisement

Also Read : సమంత చైతు విడాకులకు కారణం సమంతనేనట..!!

చక్రపాణి, కమలాకర కామేశ్వరరావు, రచయిత డి.వి. నరసరాజు కూర్చొని కథను పకడ్బందీగా రాసుకున్నారు. కన్నడ సినిమా తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడే అందులోని హీరో పాత్రలకు ఎన్టీఆర్, అక్కినేని తీసుకోవాలనుకున్నారు. గయ్యాలి పాత్రకు సూర్య కాంతాన్ని ముందే తీసుకున్నారు. మిగిలిన వారిని తరువాత ఎంపికచేసుకున్నారు. ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జమున జంట ప్రేక్షకులను అలరించింది. సినిమా మొత్తం వారి సొంత వాహినీ స్టూడియోలోనే రూపొందించారు. గుండమ్మ ఇంటి సెట్ మొత్తం స్టూడియోలో వేసినదే. సినిమా విడుదలకు 10 రోజులే ఎల్.వి.ప్రసాద్ ఇంట్లో పెళ్లి వేడుకలలో గుండమ్మ కథ ప్రదర్శించారు. సినిమా కథను మార్చేశారు. కేవలం సంభాషణలతో సినిమా నడుస్తుందా..? పెద్ద హీరోలు కాబట్టి మొదటివారం సాధారణంగా హౌస్ ఫుల్ అవుతుందని కే.వీ.రెడ్డి వ్యాఖ్యానించడంతో దర్శక, నిర్మాతలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. చక్రపాణి మాత్రమే సినిమా పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారు. జూన్ 07, 1962లో గుండమ్మ కథ చిత్రం ఆంధ్రదేశమంతటా విడుదలైంది. విమర్శకుల అంచనాలను తిరగరాస్తూ.. సినిమా అద్భుతమైన విజయాన్ని కలిగి ఉంది. సినిమా అలా నడుస్తున్నా కూడా కే.వి.రెడ్డి తమ విమర్శను ఎప్పుడూ సమర్థించుకుంటూ.. ఏంటోనండి జనాలు ఈ చిత్రాన్ని ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదని తరుచూ అంటూ ఉండేవారట. 

Also Read :  ప్రేమ,పెళ్లితో మోసపోయి ఆధ్యాత్మికత కొనసాగిస్తున్న హీరోయిన్స్ వీరే..!

Visitors Are Also Reading