Home » మోక్షాజ్ఞ ఎంట్రీకి ద‌ర్శ‌కుడు ఫిక్స్..ఎవ‌రంటే..?

మోక్షాజ్ఞ ఎంట్రీకి ద‌ర్శ‌కుడు ఫిక్స్..ఎవ‌రంటే..?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో టాప్ హీరోలుగా రానించిన చిరంజీవి, నాగార్జున లాంటి హీరోల వార‌సులు ఇప్ప‌టికే ఎంట్రీ ఇచ్చి వ‌రుస సినిమాలు చేస్తున్నారు. తండ్రికి త‌గ్గ త‌న‌యులు అనిపించుకుంటున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ బాల‌య్య కుమారుడు మోక్షాజ్ఞ మాత్రం ఎంట్రీ ఇవ్వ‌లేదు. దాంతో అత‌డి ఎంట్రీ కోసమే నంద‌మూరి అభిమానులు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా మోక్షాజ్ఞ ఎంట్రీ పై మాత్రం ఇది వ‌ర‌కూ ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. మోక్షాజ్ఞ‌కు సినిమాల‌పై ఆస‌క్తి లేద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

mokshagna

mokshagna

కానీ అవ‌న్ని పుకార్లేన‌ని బాల‌య్య చేసిన ప్ర‌క‌టనతో క్లారిటీ వ‌చ్చేసింది. లాక్ డౌన్ వేళ ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో బాల‌య్య మాట్లాడుతూ మోక్షాజ్క్ష ఎంట్రీ ఉంటుంద‌ని క‌థ‌ల‌ను ఎంపిక చేస్తున్నామ‌ని అన్నారు. దాంతో ఆ ఆత‌ర‌వాత మోక్షాజ్క్ష ఎంట్రీ ఫిక్స్ అయ్యింది. ఆ స‌మయంలో టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు క్రిష్ కు మోక్షాజ్ఞ‌ను పరిచ‌యం చేసే బాధ్య‌త బాల‌య్య అప్ప‌గించాడంటూ వార్త‌లు వ‌చ్చాయి.

Advertisement

Advertisement

కానీ తాజాగా మోక్షాజ్ఞ ఎంట్రీ బోయ‌పాటి చేతుల మీదుగా ఉండ‌బోతున్న‌ట్టు టాలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మోక్షాజ్ఞ ఎంట్రీ బాధ్య‌త‌ల‌ను పూర్తిగా బాలయ్య త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన బోయ‌పాటి శ్రీనుకు అప్ప‌గించార‌ని టాక్ వినిపిస్తుంది. త్వ‌ర‌లోనే బోయ‌పాటి క‌థ‌ను సిద్దం చేసి బాల‌య్య‌కు చెబుతార‌ని కూడా టాక్. ఇక బాల‌య్య ఆ క‌థ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వెంట‌నే సినిమా సెట్స్ పైకి వెళ్తుంద‌ని కూడా ప్రచారం జ‌రుగుతోంది. బాల‌య్య‌కు సింహా, లెజెండ్ లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు అందించి రీసెంట్ గా అఖండతో హాట్రిక్ కొట్టిన బోయ‌పాటి మోక్షాజ్ఞ‌కు ఎలాంటి హిట్ ఇస్తోరో చూడాలి మ‌రి.

Visitors Are Also Reading