Home » భారత జట్టులోకి ఎంట్రీపై దినేష్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్…!

భారత జట్టులోకి ఎంట్రీపై దినేష్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్…!

by Azhar
Ad
భారత సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీ క్రికెట్ కెరియర్ ముగిసిపోయింది అనుకున్నారు చాలా మంది. భారత జట్టు తరపున 2019 ప్రపంచ కప్ లో చివరిసారిగా ఆడిన కార్తీక్ ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు అనంతరం ఐపీఎల్ లో కూడా కొన్ని మ్యాచ్ల్లో విఫలమైనా కార్తీక్ ను కెప్టెన్ గా తొలగించి ఆ బాధ్యతలు మోర్గాన్ కు అప్పగించింది కోల్కతా నైట్ రైడర్స్. ఆతర్వాత క్రికెట్ అనంతరం మాజీ క్రికెటర్లు అందరూ ఎంచుకునే కామెంట్రీ లోకి అడుగు పెట్టాడు. అయినా కూడా క్రికెట్ ను వదలకుండా దేశవాళీ బాగా రాణిస్తు తాను కెప్టెన్ గా వ్యవహరించే తమిళనాడు జట్టును చాలా టోర్నీలలో గెలిపించాడు.
అందువల్లే ఈ ఏడాది ఐపీఎల్ లో జరిగిన వేలంలో కార్తీక్ ను కొనుగోలు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్లో తనకు వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు కార్తీక్. అందువల్ల అతడిని భారత జట్టులోకి తీసుకోవాలని… ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్ కు పంపించాలి చాలా డిమాండ్ వచ్చింది. అయితే దానిని సెలెక్టర్లు పట్టించుకుంటారా లేదా అనే ఆలోచనలో అభిమానులు ఉండగా వారందరికీ శుభవార్త చెబుతూ ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికాతో హాజరగనున్న టి20 సిరీస్ కు దినేష్ కార్తీక్ ను ఎంపిక చేసింది బీసీసీఐ.
మూడు సంవత్సరాల తర్వాత తనకు భారత జట్టు నుండి పిలుపు రావడం పట్ల దినేష్ కార్తీక్ స్పందించాడు. ”మిమ్మల్ని మీరు విశ్వసిస్తే, ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది!. అందరి మద్దతు మరియు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు… నా కృషి ఇలానే కొనసాగుతుంది” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఇక అభిమానులు కూడా కార్తీక్ కు జట్టులో స్థానం దక్కడంతో అతనికి అభినందనలు తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం కార్తీక్ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూర్ జట్టు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు చేరడంతో.. అక్కడ అతను ఎలా రాణిస్తాడు అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading