రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు రామేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో డింపుల్ హయాతి సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను కాస్త రంగు తక్కువగా ఉండటం వల్ల అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పింది. నిజంగానే తాను రంగు కాస్త తక్కువ అని అందువల్లే అవకాశాల కోసం ఎక్కడికి వెళ్ళినా తిరస్కారాలు ఎదురయ్యేవని చెప్పింది. తను చాలా నల్లగా ఉన్నానని కామెంట్స్ కూడా తన వెనకాలే వినిపించాయని డింపుల్ హయాతి తెలిపింది.
Advertisement
Advertisement
అలాంటి సమయంలోనే వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందని చెప్పింది. దాంతో ఆ తర్వాత అందరూ ఐటమ్ సాంగ్స్ కోసమే తనను సంప్రదించారని కానీ తాను హీరోయిన్ గానే ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అలాంటి సమయంలో రవితేజ లాంటి పెద్ద స్టార్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కిందని డింపుల్ హయాతి ఆనందం వ్యక్తం చేసింది.
రవితేజ పక్కన అవకాశం రావడం గొప్ప విషయమని ఇది తనను తాను ప్రూవ్ చేసుకునే సమయమని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఖిలాడి సినిమా ఫిబ్రవరి 11న దియేటర్లలో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాలో డింపుల్ హయాతి పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.