Home » “పూజా మన కాజా” అంటూ బట్టబొమ్మ పై దిల్ రాజు హాట్ కామెంట్స్ ….!

“పూజా మన కాజా” అంటూ బట్టబొమ్మ పై దిల్ రాజు హాట్ కామెంట్స్ ….!

by AJAY
Ad

ముకుంద సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పూజా హెగ్డే. ఈ సినిమా విజయం సాధించకపోయినా పూజా హెగ్డే కు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు. ఆ తరవాత పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠ పురం సినిమా తో పూజా హెగ్డే గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకుంది.

Advertisement

ఈ సినిమా తరవాత వరుస ఆఫర్ లు అందుకుంది. ఇక తాజాగా పూజా హెగ్డే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. దాంతో నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్ లు చేశారు.

Advertisement

హీరోయిన్ పూజా హెగ్డే ను పట్టుకుని పూజా మన కాజా అంటూ కామెంట్స్ చేశారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఒక్క సారిగా అవాక్కయ్యారు. అంతే కాకుండా పూజా హెగ్డే పాన్ ఇండియా హీరోయిన్ అంటూ పొగిడారు. ఆమె లెగ్ పడింది అంటే సినిమా సూపర్ హిట్టే అంటూ దిల్ రాజు కామెంట్స్ చేశారు. ఇక దానికి ముందు పూజా హెగ్డే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో కలిసి అరబిక్ కుత్తు పాటకు స్టెప్పులు వేశ్చారు.

Visitors Are Also Reading