Home » ఉదయ్ కిరణ్ డబ్బు లేక చనిపోయాడు అనేది అబద్దం.. అసలు నిజం ఏంటంటే : దిల్ మూవీ నటుడు

ఉదయ్ కిరణ్ డబ్బు లేక చనిపోయాడు అనేది అబద్దం.. అసలు నిజం ఏంటంటే : దిల్ మూవీ నటుడు

by AJAY
Ad

ఎంతో టాలెంట్ ఉండి చిన్న‌వ‌య‌సులోనే టాలీవుడ్ కు ఈ లోకానికి దూరమైన హీరో ఉద‌య్ కిర‌ణ్. తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన ఉద‌య్ కిర‌ణ్ ఆ త‌ర‌వాత స్టార్ హీరోగా డ‌ఎదిగాడు. చిత్రం త‌ర‌వాత వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ లు అందుకుని ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయాడు. స్టార్ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఉద‌య్ కిర‌ణ్ డేట్స్ కోసం ఎదురుచూసిన రోజులు ఉన్నాయి. అలా ఎదిగిన ఉద‌య్ కిర‌ణ్ ఆ త‌ర‌వాత సినిమా అవకాశాలు లేక‌పోవ‌డం..ప‌ర్స‌న‌ల్ గా ఇబ్బందులు రావ‌డంతో చిన్న‌వ‌య‌సులోనే చనిపోయాడు.

Advertisement

కాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఉద‌య్ కిర‌ణ్ తో క‌లిసి సినిమాలు చేసిన న‌టుడు దిల్ ర‌మేష్ ఆస‌క్తిక‌ర విష‌యాలను వెల్ల‌డించారు. నువ్వునేను సినిమాలో దిల్ ర‌మేష్ ఉద‌య్ కిర‌ణ్ తో క‌లిసి న‌టించాడు. ఇంట‌ర్వ్యూలో దిల్ ర‌మేష్ మాట్లాడుతూ…తాను క‌లిసి న‌టించిన ఉదయ్ కిర‌ణ్, శ్రీహ‌రిలు చ‌నిపోవ‌డం త‌న సినిమా జీవితంలో ఓ విషాదం అని చెప్పారు.

Advertisement

udaykiran

udaykiran

శ్రీహ‌రితో క‌ల‌సి తాను దాదాపు ప‌ది సినిమాలో నటించాన‌ని చెప్పారు. నువ్వు నేను సినిమా స‌మ‌యంలో ఉద‌య్ కిర‌ణ్ త‌న‌తో చాలా ఫ్రెండ్లీగా ఉండేవార‌ని చెప్పారు. ఉద‌య్ కిర‌ణ్ హీరో అనే ఫీలింగ్ ఉండేది కాద‌ని చాలా క్లోజ్ గా ఉండేవాడ‌ని చెప్పారు. ఉద‌య్ కిర‌ణ్ సినిమా ఆఫ‌ర్ లు లేక‌పోవ‌డంతో డిప్రెష‌న్ లోకి వెళ్లార‌ని చెప్పారు.

ఉద‌య్ కిర‌ణ్ చిన్న వ‌య‌సులోనే ఎంతో స‌క్సెస్ ను చూశార‌ని చెప్పారు. ఇండ‌స్ట్రీలో డెబ్బై ల‌క్ష‌ల రెమ్యున‌రేషన్ అతి చిన్న వ‌య‌సులో తీసుకున్న ఘ‌న‌త ఉద‌య్ కిర‌ణ్ కే ద‌క్కింద‌ని అన్నారు. ఉద‌య్ కిర‌ణ్ ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో  చనిపోయాడు…కేవ‌లం డిప్రెష‌న్ వ‌ల్ల‌నే అలా చేసుకున్నాడ‌ని చెప్పారు.

Visitors Are Also Reading