Home » RRR యూనిట్ కు దిల్ రాజు గ్రాండ్ పార్టీ…ఫోటోలు వైరల్…!

RRR యూనిట్ కు దిల్ రాజు గ్రాండ్ పార్టీ…ఫోటోలు వైరల్…!

by AJAY
Published: Last Updated on
Ad

రామ్ చరణ్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు జక్కన్న దర్శకత్వం వహించారు. మార్చి 25 న ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.750 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

Advertisement

వెయ్యి కోట్ల టార్గెట్ దిశగా దూసుకెళుతోంది. ఖచ్చితంగా వెయ్యి కోట్లను కలెక్ట్ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ సినిమా తో దిల్ రాజుకు కూడా భారీగా లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ సినిమాతో దిల్ రాజు నష్టపోగా ఆర్ఆర్ఆర్ సినిమా తో ఆ నష్టాలు పోయి లాభాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. క ఈ నేపథ్యంలోనే దిల్ రాజు హైదరబాద్ లో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు.

ఈ పార్టీకి ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులు అంతా హాజరు అవుతున్నారు. చరణ్, ఎన్టీఆర్ లు తమ భార్యలతో కలిసి వచ్చారు. రాజమౌళి, కీరవాణి సైతం ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీ లో ఎన్టీఆర్ చరణ్ తో పాటు రాజమౌళి ప్లెక్సీ లను కూడా ఏర్పాటు చేశారు.

Visitors Are Also Reading