Home » వంశీ పైడిపల్లి విజయ్ సినిమా సీక్రెట్ బయట పెట్టిన దిల్ రాజు…!

వంశీ పైడిపల్లి విజయ్ సినిమా సీక్రెట్ బయట పెట్టిన దిల్ రాజు…!

by AJAY
Ad

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి దిల్ రాజు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని చెప్పారు. విజయ్ ఈ సినిమా కథ విని చాలా మెచ్చుకున్నారని ఇలాంటి కథలు ఇప్పటి వరకు వినలేదని అన్నారని తెలిపారు. స్టోరీ చాలా బాగుందని అప్పట్లో విజయ్ ఫ్యామిలీ సినిమాలు చేశారు కానీ ఫ్యామిలీ చిత్రాలకు చాలా గ్యాప్ వచ్చిందని దిల్ రాజు అన్నారు.

Advertisement

Advertisement

ఈ సినిమాలో ఎమోషన్స్, యాక్షన్, సాంగ్స్ తో పాటు మంచి కంటెంట్ ఉంటుందని దిల్ రాజు తెలిపారు. విజయ్ మాస్ హీరో అని కానీ ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలిపారు. ఇదిలా ఉండగా వంశీ పైడిపల్లి ప్రభాస్ హీరోగా నటించిన మున్నా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఎవడు సినిమా తో వంశీ పైడిపల్లి మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ ని లైన్ లో పెట్టారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading