Telugu News » Blog » వెబ్ సిరీస్ నిర్మాణంలోకి దిల్ రాజు ఎంట్రీ….ఆ ద‌ర్శ‌కుడితో క‌లిసి బిగ్ ప్లాన్..!

వెబ్ సిరీస్ నిర్మాణంలోకి దిల్ రాజు ఎంట్రీ….ఆ ద‌ర్శ‌కుడితో క‌లిసి బిగ్ ప్లాన్..!

by AJAY
Ads

టాలీవుడ్ ప్ర‌ముఖ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఇప్ప‌డు ఓటీటీ రంగంలో వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు కూడా సిద్ద‌మ‌య్యారు. దిల్ రాజు త‌ను నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ను ప్ర‌క‌టించారు. హరీష్ శంక‌ర్ తో క‌లిసి దిల్ రాజు ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. హ‌రీష్ శంక‌ర్ ఈ వెబ్ సిరీస్ కు క‌థ‌ను అందిస్తుండ‌గా చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక జీ 5 ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

DILL RAJU

DILL RAJU

వెబ్ సిరీస్ టైటిల్ ను ఏటీఎం రాబ‌రీగా దిల్ రాజు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా నిర్మాణ రంగా అంచెలంచెలుగా ఎదిగి దిల్ రాజు బ‌డా నిర్మాత‌గా ఉన్నారు. రీసెంట్ గా దిల్ రాజు త‌న సోద‌రుడు కుమారుడు ఆశిష్ రెడ్డిని రౌడీ బాయ్స్ అనే సినిమాతో ప‌రిచ‌యం చేశాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ సంధ‌ర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగా అడుగులు వేయాల‌ని అన్నారు.

Advertisement

Harish Shanker

Harish Shanker

ఇక ఇప్పుడు ఏకంగా వెబ్ సిరీస్ ను అనౌన్స్మెంట్ చేశారు. మ‌రో వైపు దిల్ రాజు భారీ సినిమాల‌ను తెరకెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటూ త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.