Telugu News » Blog » గాడ్ ఫాదర్ సినిమాపై దిల్ రాజు కుట్ర..?

గాడ్ ఫాదర్ సినిమాపై దిల్ రాజు కుట్ర..?

by Manohar Reddy Mano
Ads

టాలీవుడ్ లోనే టాప్ నిర్మాతల్లో ఒక్కడు దిల్ రాజు. అయితే తెలంగాణలో థియేటర్లు మొత్తం ఎక్కువగా దిల్ రాజు కంట్రోల్లోనే ఉంటాయి అనే విషయం తెలిసిందే. అయితే ఆ పవర్ ను పెట్టుకొనే ఈ మధ్యే నిఖిల్ యొక్క కార్తికేయ 2 సినిమా విడుదలకు అడ్డంకులు క్రియేట్ చేసి విమర్శల పాలయ్యాడు దిల్ రాజు. అయిన కూడా తన విధానం మార్చుకోకుండా ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా పై కూడా ఓ కుట్ర అనేది చేస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహన రాజా దర్శకత్వంలో వచ్చే నెల 5న దసరా కానుకగా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. అయితే ఈ సినిమా మలయాళం లూసిఫర్ అనే సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఇక ఈ సినిమాపైన మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాను నిర్మాతలు మొదట నైజం సొంతంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు.

Advertisement

అందుకే ఈ సినిమా హక్కులను దిల్ రాజుకు అమ్మలేదు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకున్న నిర్మాతలు గాడ్ ఫాదర్ హక్కులను నైజం మరో డిస్టిబ్యూటర్ కు అమ్మారు అని తెలుస్తుంది. దాంతో నైజం ఏరియాలో మొత్తం పట్టుకున్న దిల్ రాజు.. తనకు కాకుండా వేరొకరికి ఈ సినిమా హక్కులను అమ్మడంతో సీరియస్ గా ఉన్నారు అని.. అందుకే ఇక్కడ ముఖ్యమైన చాలా థియేటర్లలో గాడ్ ఫాదర్ సినిమా విడుదల కాకుండా కుట్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇవి కూడా చదవండి :

రామ్ చరణ్ ఇంటికి భారత ఆటగాళ్లు..!

భారత జట్టులోకి ఉమ్రాన్ రీ ఎంట్రీ..?