Home » దిల్ రాజును బాగా ఇబ్బంది ఆ సినిమాలు !

దిల్ రాజును బాగా ఇబ్బంది ఆ సినిమాలు !

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంచుకునే సినిమాలపై ప్రేక్షకులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. దిల్ రాజు బ్యానర్ నుండి ఏ సినిమా వస్తుంది అంటే అందులో కచ్చితంగా మ్యాటర్ ఉంటుందని వారు భావిస్తారు. కానీ ఇదంతా ఒకప్పటి వ్యవహారంగా మారింది. గత కొంతకాలంగా దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమాలు చూస్తే, ఆయన ఎంచుకునే సినిమాలో ఆయన ట్రాక్ తప్పినట్లు కచ్చితంగా చెప్పగలరు. గత కొంతకాలంగా దిల్రాజు వరుస రీమేక్ చిత్రాలను తన బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నాడు.

Advertisement

Advertisement

దీంతో ఆయా సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడం లో విఫలమవుతున్నాయి. ఇతర భాషల్లో సూపర్ సక్సెస్ అయిన సినిమాలు కూడా తెలుగులో దిల్ రాజు చవి షోస్తున్నాడు. దీంతో ఆయన స్ట్రైట్ సినిమాలు చేయాలని పలువురు ఆయనకు సూచన చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో తమిళ సూపర్ హిట్ 96 చిత్రాన్ని అనే ‘జాను’ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.

READ ALSO :  రైల్వే ప్లాట్ ఫామ్ పైన ప‌సుపు రంగు గీత‌లు ఎందుకు ఉంటాయో తెలుసా?

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెలుగులో శర్వానంద్, సమంత జంటగా రూపొందించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. అయితే ఈ సినిమాకు పెద్దగా లేకపోవడంతో దిల్రాజు హైరానా పడుతున్నారు. మరి ఈ రీమేక్ చిత్రం దిల్ రాజు ఎలాంటి ఫలితాన్ని ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Visitors Are Also Reading