Home » మైత్రి మూవీ మేకర్స్ కి భారీ రివేంజ్ ప్లాన్ చేసిన నిర్మాత దిల్ రాజు.. అందుకోసమేనా ?

మైత్రి మూవీ మేకర్స్ కి భారీ రివేంజ్ ప్లాన్ చేసిన నిర్మాత దిల్ రాజు.. అందుకోసమేనా ?

by Anji
Ad

తెలుగులో అగ్ర నిర్మాతగా  దిల్ రాజుకు మంచి పేరు ఉంది. ఆయన చేసిన సినిమాలు దాదాపుగా హిట్ అవుతాయని టాక్ నడుస్తోంది. ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన హిట్ పలకరించకపోయినా ఆయన  రికార్డు స్థాయిలో లాభాలు తెచ్చిన సినిమాలున్నాయి. ఆయన ఈ మధ్యకాలంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి ఒక భారీ షాక్ ఎదుర్కొన్నారు. అసలు ఏమైందంటే మైత్రి మూవీ మేకర్స్ ఈ సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

అయితే ఈ రెండు సినిమాలు తనకే ఇస్తారని నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేయవచ్చని దిల్ రాజు భావించారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దిల్ రాజుకు ఆ సినిమాలు ఇవ్వకుండా సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడంతో దిల్ రాజు ఒక్కసారిగా షాక్ అయ్యారట. వాళ్లు కనుక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మొదలు పెడితే ఈ రెండు సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ ఆగదు. కచ్చితంగా దిల్ రాజుకు పోటీగా వారు ఇతర నిర్మాతల సినిమాలు రిలీజ్ చేసి తనకు తలనొప్పిగా మారే అవకాశాలు  ఉంటాయని దిల్ రాజు భావిస్తున్నాడట. ఈ విషయాన్ని దిల్ రాజు జీర్ణించుకోలేకపోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

ఇప్పటికే  విజయ్ దళపతి-వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చే వారసుడు సినిమాని సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు దిల్ రాజు.  ఇప్పుడు మరో రెండు సినిమాలను కూడా సంక్రాంతికి దించితే ఎలా ఉంటుందనే ఆలోచనలో  ఉన్నట్లుగా తెలుస్తోంది. తన ఆ ప్రొడక్షన్ లోనే కాక వేరే నిర్మాతల సినిమాలు ఏవైనా రిలీజ్ కి సిద్ధం అయ్యాయా? ఒకవేళ అయితే జనవరిలో థియేటర్లను బ్లాక్ చేసి ఆయా సినిమాలను కూడా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలకు పోటీగా ఎలా దించాలనే యోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి  ఇప్పటికే ఆయన పలు థియేటర్లను బ్లాక్ చేసే పనిలో పడ్డారని చెబుతున్నారు.  ఇక  విశాఖపట్నంలో అయితే ఇప్పటికే ఫేమస్ థియేటర్లను వారసుడు సినిమా పేరుతో ఆయన బ్లాక్ చేశారని తెలుస్తోంది. ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద ఉన్న కోపంతోనే దిల్ రాజు ఇలా చేస్తున్నారనే  వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీస్  మీద దిల్ రాజు పంతం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Also Read :  ఆ త‌ప్పుచేసినందుకు ఉద‌య్ కిర‌ణ్ నా కాళ్లు ప‌ట్టుకుంటాన‌న్నాడు…తేజ సెన్సేష‌న‌ల్ కామెంట్స్..!

Visitors Are Also Reading