Home » విజయ్ కి డైరెక్టర్ ను సెట్ చేసిన దిల్ రాజు..!

విజయ్ కి డైరెక్టర్ ను సెట్ చేసిన దిల్ రాజు..!

by Azhar
Ad

టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో చాల తొందరగా తన పేరును విజయ్ దేవరకొండ చేర్చుకున్నాడు. అంతే తొందరగా పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో కూడా హన పేరును చేర్చుకోవాలని విజయ్ ప్రయత్నించగా అది కాస్త బెడిసి కొట్టింది అనే చెప్పాలి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో తన కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా లైగర్ చేసాడు. కానీ ఇది భారీ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

దాంతో కెరియర్ లో విజయ్ కొంత నెమ్మదించాడు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు విజయ్ రెండు సినిమాలలో చేస్తున్నాడు. అందులో శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషి సినిమా కాగా.. మరొకటి మళ్ళీ పూరితోనే చేస్తున్న జన గణ మన అనే సినిమా. అయితే ఈ రెండు సినిమాల తర్వాత విజయ్ నిర్మాత దిల్ రాజుతో కలిసి సినిమా చేయనున్నాడు అనే విషయం తెలిసిందే.

Advertisement

ఇక ఇప్పటికే దిల్ రాజు.. తన దర్శకులతో విజయ్ కోసం కథ అనేది సిద్ధం చేయాలనీ సూచించాడు. అయితే ఇప్పుడు విజయ్ కోసం డైరెక్టర్ ను దిల్ రాజు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అది ఎవరో కాదు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న హరీష్ శంకర్. అయితే విజయ్ కోసం ఒక్క స్టోరీ లైన్ అనేది తాజాగా హరీష్… దిల్ రాజుకు చెప్పగా.. దానికి ఆయన ఓకే చెప్పి కథను సిద్ధం చేయమనట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

అర్ష్‌దీప్ కు పెరుగుతున్న మద్దతు..!

కోహ్లీ టీ20లకు వీడ్కోలు చెప్పాల్సిందే..!

Visitors Are Also Reading