Home » దిల్‌ రాజు పై ప్రశంసలు..!

దిల్‌ రాజు పై ప్రశంసలు..!

by Azhar
Ad

టాలీవుడ్ లోని పెద్ద నిర్మాతలలో దిల్‌ రాజు ముందువరుసలో ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే దిల్‌ రాజుపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. తన సినిమా విషయంలో దిల్‌ రాజు పక్కాగా ఉంటాడు అనే విషయం తెలిసిందే. దిల్‌ రాజు బ్యానర్ లో ఓ సినిమా వస్తుంది అంటే అది హిట్ అని చాలా మంది అనుకుంటారు. ఇక సినిమా బాగా రావడానికి దిల్‌ రాజు అనుకున్నదానికంటే ఎక్కువ కూడా ఖర్చుపెడతాడు. ఆ తర్వాత ఆ సినిమాను విపరీతంగా ప్రమోషన్స్ కూడా చేస్తాడు. అలా తన సినిమా జనాల్లోకి బాగా వెళ్లేలా చుకుంటున్నాడు.

Advertisement

అయితే 2020 లో వచ్చి ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసిన కరోనా కారణంగా థియేటర్లకు బాగా నష్టం వచ్చిన విషయం అందరికి తెలుసు. చాలా సినిమాలు థియేటర్లకు రాకుండా ఓటీటీలకు వెళ్లాయి. ఇక అదే విధంగా ఇంకొన్ని సినిమాలు విడుదల అయిన వారానికే ఓటీటీలోకి వెళ్లాయి అనేది అందరికి తెలుసు. ఇలా చేస్తే థియేటర్లకు చాలా నష్టం వస్తుంది అని తెలిసిన కొంతమంది నిర్మాతలు డబ్బుల కోసం ముందే సినిమాలను ఓటీటీలవ్ విడుదల చేసేవారు. ఇక దిల్ రాజు కూడా డబ్బుకు బాగా ప్రాముఖ్యత ఇస్తాడు అనే వాదన ఉంది.

Advertisement

ఈ మధ్య తాజాగా దిల్‌ రాజు నిర్మాతగా ఎఫ్ 3 అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల సమయంలోనే 50 రోజుల కంటే ముందు ఓటీటీలోకి రాదు అని దిల్‌ రాజు పేర్కొన్నారు. ఇక సినిమా విడుదల తర్వాత కేవలం రెండు వారలు మాత్రమే నడిచింది. ఇక ఆ సినిమాకు కలెక్షన్స్ అనేవి ఆగిపోయిన తర్వాత నాలుగో వారంలో సినిమాను ఓటీటీలోకి తెస్తే ఎక్కువ డబ్బులు ఇష్టం అనే ఆఫర్ దిల్‌ రాజు కు వచ్చిందట. కానీ ఆయన మాత్రం ఇచ్చిన మాట ప్రకారం 50 రోజుల తర్వాత ఓటీటీలో వచ్చేలా మాట్లాడుకొని అదే విధంగా విడుదల చేయబోతున్నాడట. అందుకే దిల్ రాజుపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

సీఎస్‌కేపై మరోసారి కోపాన్ని చూపించిన జడేజా…!

హాట్‌స్టార్‌కి భారీ నష్టం చేస్తున్న ఐపీఎల్..!

Visitors Are Also Reading