Home » దిల్ రాజు గురించి ఆ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్ ! పవన్ చెప్పే వరకు ఎవరికీ తెలియదట

దిల్ రాజు గురించి ఆ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్ ! పవన్ చెప్పే వరకు ఎవరికీ తెలియదట

by AJAY
Ad

దిల్ సినిమాతో నిర్మాతగా టాలీవుడ్ కు పరిచయమైన నిర్మాత దిల్ రాజు. అసలు పేరు రాజు కాగా దిల్ సినిమా విజయంతో ఆయన ఇంటిపేరు దిల్ గా మారిపోయింది. ఆ తర్వాత దిల్ రాజు ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలను నిర్మించారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ ల‌లో ఒకరిగా దిల్ రాజు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయ‌న నిర్మించారు. అంతేకాకుండా కొత్త హీరోలను దిల్ రాజు టాలీవుడ్ కు పరిచయం చేశారు.

Advertisement

మొదట డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగుపెట్టిన దిల్ రాజు ఆ తర్వాత మొదటి సినిమాతో నిర్మాతగా హిట్ అందుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం దిల్ రాజు చేతిలో చాలా థియేటర్లు ఉన్నాయి. దాంతో సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయిలో దిల్ రాజు ఉన్నారు. కొద్ది రోజులుగా దిల్ రాజు పై ట్రోల్స్ కూడా వస్తున్నాయి. మంచి సినిమాలను..చిన్న సినిమాల‌ను అడ్డుకుంటున్నారు అని ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి.

Advertisement

DILL RAJU

DILL RAJU

ఇదిలా ఉంటే దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వకీల్ సాబ్ సినిమా సమయంలో వివాదాలు త‌లెత్తిన‌ సంగతి తెలిసిందే. ఆ సినిమాను వైసీపీ సర్కార్ అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ ఆరోపాలు చేశారు. కాగా ఓ మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ…. సినిమా విడుదల గురించి సీఎం జగన్ వద్దకు వెళ్లి మాట్లాడ‌తాన‌ని చెప్పారు. దాంతో పవన్ కళ్యాణ్ మీ నాయకుడే కదా వెళ్లి అడగండి అంటూ సమాధానం ఇచ్చాడు.

ఈ విష‌యంపై ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు స్పందించారు. ఆరోజు పవన్ కళ్యాణ్ అలా అనడం వల్లనే తాను రెడ్డి అనే విషయం చాలామందికి తెలిసిందని అన్నారు. అందరితో పాటు తాను కూడా షాక్ అయ్యానని చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇరు ప్రభుత్వాలతో సినిమా ఇండస్ట్రీ సఖ్యతగా ఉంటుందని చెప్పారు. అధికారంలో ఎవరితో ఉన్న వారితో అనుకూలంగా ఉండాలి కానీ వ్యతిరేకంగా ఉండకూడదు అని దిల్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Visitors Are Also Reading