శ్యామ్ సింగరాయ్ సినిమా వేడుకలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా వేడుకలో నాని తప్పుగా ఏమీ మాట్లాడలేదు అని…. తప్పుగా అర్థం చేసుకున్నారని నానిని దిల్ రాజు వెనకేసుకొచ్చారు. ఆ తర్వాత దిల్ రాజు మరో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఏపీ ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను సరిగా తీసుకువెళ్ళలేదని తాము భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇస్తే మరోసారి కలవాలని అనుకుంటున్నట్టు దిల్ రాజు వెల్లడించారు.
Advertisement
Advertisement
తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకునే విధంగా వెసులుబాటు కల్పించినట్టు త్వరలోనే ఏపీలో కూడా వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఎవరూ వ్యక్తి గతంగా మాట్లాడవద్దని అన్నారు. ఇండస్ట్రీకి చెందిన సమస్యలపై చర్చలు జరపడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ కు ఏపీ ప్రభుత్వం నుండి పిలుపు వచ్చిందని వెల్లడించారు. ప్రభుత్వం చొరవ తీసుకుందని దిల్ రాజు మరియు స్రవంతి రవికిషోర్ వ్యాఖ్యానించారు.
దాంతో ఇప్పటికే కొంత మంది పేర్లను ప్రభుత్వానికి పంపించామని త్వరలోనే కమిటీ వివరాలను ప్రభుత్వం వెల్లడిస్తుందని తెలిపారు. కమిటీ ఉంటే చర్చలు జరపడానికి సులభతరం అవుతుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పేర్ని నాని తో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశానికి కమిటీ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. త్వరలో సమస్యలు తొలగిపోతాయని పాత రోజులు వచ్చి అద్భుతంగా ఉంటుందని దిల్ రాజు ధీమాగా చెప్పారు. మరి దీనిపై ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.