Telugu News » Blog » “అతడు” మూవీలో ముందుగా ఆ హీరోని అనుకున్నారా..మహేష్ కి ఎలా వచ్చిందంటే..?

“అతడు” మూవీలో ముందుగా ఆ హీరోని అనుకున్నారా..మహేష్ కి ఎలా వచ్చిందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మూవీ అతడు. ఈ సినిమా అప్పట్లో ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. అయితే ఈ చిత్రాన్ని జయభేరి అనే నిర్మాణ సంస్థ ద్వారా మురళీమోహన్ నిర్మించారు. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు కంటే ముందు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చేద్దామనుకొని ఆయన కథ చెప్పడానికి వెళ్తే పవన్ ఈ కథ వింటూ నిద్రపోయారని విషయం త్రివిక్రమ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement

అలా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ నుంచి మిస్సయింది. అయితే ఈ సినిమా స్టోరీ విన్నాక ప్రొడ్యూసర్ మురళీమోహన్ ఈ సినిమాకి మొదటగా హీరోగా ఉదయ్ కిరణ్ తీసుకుందామని అనుకున్నారట. అయితే ఇదే విషయాన్ని ఆయన్ను అడగడం కోసం వెళ్లారు. కానీ అప్పటికే ఉదయ్ కిరణ్ చిరంజీవి బిడ్డను పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ బయటకు రావడంతో, ఆయన డేట్స్ మొత్తం అల్లు అరవింద్ చూసుకోవడం స్టార్ట్ చేశారు.

Advertisement

ఈ సమయంలోనే మురళీమోహన్ వెళ్లి ఇలా స్టోరీ ఉందని చెప్పడంతో, మీరు వెళ్లి అల్లు అరవింద్ గారిని నా డేట్స్ గురించి అడగండని చెప్పారట ఉదయ్ కిరణ్. ఆయన మాట ప్రకారం అల్లు అరవింద్ ను అడిగాక ఆయన డేట్స్ ఖాళీ లేవని చెప్పడంతో, ఉదయ్ కిరణ్ వదిలేసి మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలని భావించి ఆయనకు కథ వినిపించారట. దీంతో ఆయన ఒకే చెప్పడంతో, సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. ఈ విధంగా బ్లాక్ బస్టర్ ను ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్నారని చెప్పవచ్చు.

Advertisement

also read: