శనివారం శనిగ్రహానికి అంకితమైన రోజు అన్న సంగతి తెలిసిందే. శనిగ్రహానికి అధిపతి అయిన శనిదేవుడు అందరి బాగోగులు చూస్తారు. గ్రహచారానికి తగ్గట్లుగా కర్మఫలాలను అందిస్తారు. శనిదేవుడి ఎవరి కర్మలను అనుసరించి వారికి శిక్షలు వేస్తూ ఉంటారు. అయితే కొన్ని ఆచారాలను పాటించడం వలన ఆ కర్మ ఫలాలలో కొంత మినహాయింపుని పొందవచ్చు. శనిగ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. అన్యాయం జరిగితే శనిగ్రహం సహించదు.
Advertisement
కర్మను అనుసరించి ఫలితాన్ని ఇచ్చే శని దేవుడు ఒక్కోసారి మేలు చేస్తాడు. ఒక్కోసారి కీడు చేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో శని గ్రహం గ్రహచారం జరుగుతున్నప్పుడు మంచి, చెడు రెండూ జరుగుతాయి. ఇది శనీశ్వరుడి చేతిలోనే ఉంటుంది. ఆయనను తృప్తి పరిస్తే సాధారణ వ్యక్తి కూడా రాజు అయ్యి కూర్చుంటాడు. శనివారం రోజున మీరు కొన్నిటిని చూడగలిగితే.. మీపై శని గ్రహం దయ చూపిస్తోందని అర్ధం.
Advertisement
శనివారం ఉదయాన్నే ఎవరైనా భిక్షగాడిని చూస్తే దానం చేయడం మంచిది. శనివారం నాడు చెత్త ఊడ్చే వ్యక్తులను చూడడం కూడా మీకు శుభ సూచకమే. నల్ల కుక్క ఒకవేళ మీకు శనివారం రోజున కనిపిస్తే, అది కూడా మీ మంచికేనని గుర్తుంచుకోండి. దానికి ఏమైనా ఆహరం పెట్టండి. మీకు శనిదేవుని అనుగ్రహం కలిగింది అనడానికి ఇవి ఉదాహరణలు. అలానే, నల్ల కాకి మీ ఇంటికి మంచి నీటి కోసం వచ్చినా, మీ ఇంటి గోడపై వాలినా మీకు శుభసూచకమే. అలాగే, ఈరోజున మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్న సమయంలో నల్లని ఆవు కనిపిస్తే అది మీకు శుభ సూచకం. మీరు వెళ్లే పని దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అలాగే, నల్లని ఆవుని దానం చేసినా కూడా చక్కటి ఫలితాలను పొందుతారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
chanikya niti : ఈ నాలుగు లక్షణాలు ఉన్న వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గరకు రానివ్వకండి..?
Chanikya niti : భార్యలో కనుక ఈ మూడు లక్షణాలు ఉంటే ఆ భర్త అదృష్టవంతుడే..!