Home » ఆర్ఆర్ఆర్ లో ఈ సీన్ గ‌మ‌నించారా..? దాని వెన‌క ఉన్న చ‌రిత్ర తెలుసా..!

ఆర్ఆర్ఆర్ లో ఈ సీన్ గ‌మ‌నించారా..? దాని వెన‌క ఉన్న చ‌రిత్ర తెలుసా..!

by AJAY
Published: Last Updated on
Ad

RRR Movie: ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భ‌ట్ న‌టించ‌గా ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ న‌టించింది. భారీ విజువ‌ల్స్ తో జక్క‌న్న ఈ సినిమాను తెర‌కెక్కించారు.

RRR Movie

RRR Movie

ఇక ఈ సినిమా మ‌నల్ని బ్రిటిష్ వాళ్లు పాలిస్తున్న స‌మ‌యంలో జ‌రిగిన‌ట్టుగా చూపించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు అయిన అల్లూరి సీతారామరాజు పాత్ర లో ఎన్టీఆర్ ను, కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ ను చూపించారు. నిజ‌మైన క‌థ‌లో కొమురం భీం, అల్లూరి క‌లుసుకోలేదు. కానీ వాళిద్ద‌రూ క‌లుసుకుంటే..క‌లిసి బ్రిటిష్ వాళ్ల‌తో పోరాటం చేస్తే ఎలా ఉంటుంద‌న్న‌ది జ‌క్క‌న్న కండ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

Advertisement

Advertisement

ఇక బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో జ‌క్క‌న్న ఈ సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అప్ప‌టి నేటివిటికి త‌గ్గ‌ట్టుగానే ప్ర‌తి సీన్ రాసుకున్నారు. ఇక ఈ సినిమాలో కొమురం భీం మ‌రియు రామ‌రాజు ప‌డ‌వ‌లో మంటల్లో చిక్కుకున్న ఓ బాలుడిని ర‌క్షిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ సీన్ లో రామ‌రాజు చేతిలో ఓ జెండా క‌నిపిస్తుంది.

ఆ జెండాకు ఓ చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం….ఈ జెండానే మ‌న తొలి జాతీయ జెండా…1906వ సంవ‌త్స‌రం ఆగ‌స్టు 7వ తేదీన ఈ జెండా వాడుక‌లోకి వ‌చ్చింది. కోల్ క‌త్తాలోని పార్శీ బ‌గ‌న్ చౌక్ లో మొద‌టిసారిగా ఈ జెండాను ఆవిష్క‌రించారు. ఈ జెండాలో పైన ఆకుప‌చ్చ రంగు, మ‌ధ్య‌లో పసుపు, కింద ఎరుపు రంగులు ఉంటాయి. కేవ‌లం ఒక్క సంవ‌త్స‌రం మాత్రమే ఈ జండాను వాడారు. ఆ త‌ర‌వాత 1907లో జెండా మారింది.

 

Also read : బోణీ కపూర్ కంటే ముందు టాలీవుడ్ నుండి శ్రీదేవికి వచ్చిన సంబంధాలు ఏవో తెలుసా…!

Visitors Are Also Reading